తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Modi On Sanatana Dharma : ''భారత్‌', 'సనాతన..'పై ఆచితూచి మాట్లాడండి'.. మంత్రులకు మోదీ సూచన - భారత్​ పేరు మార్పు లేటెస్ట్​

Modi On Sanatana Dharma Remark Row : వివాదాస్పద అంశాలపై సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా స్పందించాలని కేంద్రమంత్రులకు ప్రధాని మోదీ సూచించినట్లు సమాచారం. సనాతన ధర్మ వివాదం, భారత్‌ అంశాలను ప్రస్తావిస్తూ ఆయన.. కేంద్ర మంత్రివర్గ భేటీలో ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో కేబినెట్‌ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.

modi on sanatana dharma remark row
modi on sanatana dharma remark row

By ETV Bharat Telugu Team

Published : Sep 6, 2023, 6:06 PM IST

Updated : Sep 6, 2023, 6:39 PM IST

Modi On Sanatana Dharma Remark Row : ఒకవైపు 'ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌' పేరిట రాష్ట్రపతి పంపిన ఆహ్వాన పత్రాలపై రాజకీయ దుమారం చెలరేగుతుండగా.. మరోవైపు తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ సనాతన ధర్మంపైచేసిన వ్యాఖ్యలపైన కూడా వివాదం నెలకొంది. ఈ రెండు అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించినట్లు తెలుస్తోంది. ఆ రెండు అంశాలపై ఆచితూచి మాట్లాడాలని ప్రధాని.. కేంద్ర మంత్రులకు సూచించినట్లు సమాచారం.

'భారత్​ పేరు మార్పుపై వారు మాత్రమే మాట్లాడండి'
ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశాలు 'భారత్ పేరు మార్పు' అంశాన్ని ప్రధాని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. భారత్‌ అంశంపై అతిగా స్పందించొద్దని కేంద్ర మంత్రులకు మోదీ సూచించినట్లు సమాచారం. కేవలం సంబంధిత వ్యక్తులు మాత్రమేదీనిపై మాట్లాడాలని ప్రధాని స్పష్టం చేశారట.

సమర్థంగా తిప్పికొట్టండి: మోదీ
Stalin Sanatana Dharma Remark :తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌.. సనాతన ధర్మంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపైనా ప్రధాని పరోక్షంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఆ వ్యాఖ్యలను సమర్థంగా తిప్పికొట్టాలని కేంద్రమంత్రులకు మోదీ సూచించినట్లు సమాచారం. చరిత్రలోతుల్లోకి తొంగిచూడొద్దని.. కానీ రాజ్యాంగం ప్రకారం వాస్తవాలకు కట్టుబడి ఉండాలని కేబినెట్‌ సహచరులకు మోదీ సూచించినట్లు తెలుస్తోంది. సమకాలీన పరిస్థితుల గురించి మాట్లాడాలని కేంద్రమంత్రులకు సూచించిన ప్రధాని.. వివాదాస్పద వ్యాఖ్యలకు సమర్థమైన స్పందన అవసరమని అన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టమ్‌ అభివృద్ధికి రూ.3760 కోట్లు..
Battery Energy Storage System :ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఈ కేబినెట్‌ భేటీలో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టమ్‌ అభివృద్ధికి 3,760 కోట్ల రూపాయల కేటాయింపులకు ఆమోదముద్ర పడింది. వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ కింద కేంద్రం నిధులు కేటాయించామని.. మొత్తం ఖర్చు తామే భరిస్తామని కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు. 2030-31 వరకు 5 దశల్లో నిధులు విడుదల చేస్తామని వివరించారు. దేశంలో 4 వేల మెగావాట్ల నిల్వకు ఈ విధానం ఉపకరిస్తుందని కేంద్రం తెలిపింది. హిమాచల్‌, ఉత్తరాఖండ్‌లో పరిశ్రమల అభివృద్ధికి రూ. 1164 కోట్ల కేటాయింపు నిర్ణయానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

Last Updated : Sep 6, 2023, 6:39 PM IST

ABOUT THE AUTHOR

...view details