తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సోమ్‌నాథ్‌ ఆలయ ట్రస్ట్‌ ఛైర్మన్‌గా మోదీ - కేశూభాయ్‌ పటేల్‌

ప్రపంచ ప్రఖ్యాత సోమ్‌నాథ్‌ ఆలయ ట్రస్ట్‌ కొత్త ఛైర్మన్‌గా ప్రధాని నరేంద్ర మోదీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆలయ ట్రస్టు 120వ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

Modi named Somnath Temple trust chairman; 2nd PM to hold post
రెండోసారి సోమ్‌నాథ్‌ ఆలయ ట్రస్ట్‌ ఛైర్మన్‌గా మోదీ

By

Published : Jan 18, 2021, 10:45 PM IST

గుజరాత్​లోని సోమనాథ్​ దేవాలయ ట్రస్ట్ ఛైర్మన్​గా​ మోదీ నియమితులయ్యారు. గుజరాత్‌లోని గిర్‌ సోమనాథ్‌ జిల్లాలోని ప్రభాస్‌ పటాన్‌ పట్టణంలో ఉన్న ఈ ప్రముఖ ఆలయ ట్రస్ట్‌కు ఇప్పటికే ట్రస్టీగా కొనసాగుతున్న మోదీని.. ఛైర్మన్‌గా ఎన్నుకున్నట్టు సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు.

కేశూభాయ్‌ మరణంతో..

గత కొన్నేళ్ల పాటు ట్రస్టు ఛైర్మన్‌గా పనిచేసిన గుజరాత్‌ మాజీ సీఎం కేశూభాయ్‌ పటేల్‌ అక్టోబర్‌లో మరణించడంతో అప్పట్నుంచి ఈ స్థానం ఖాళీగా ఉంది. దీంతో ఆలయ ట్రస్టు 120వ సమావేశం సోమవారం వర్చువల్‌ పద్ధతిలో జరిగింది. ఇందులో పాల్గొన్న ట్రస్టీలంతా కొత్త ఛైర్మన్‌గా మోదీని నియమించాలని ఏకగ్రీవంగా నిర్ణయించినట్టు ట్రస్టీ సెక్రటరీ పీకే లెహ్రీ వెల్లడించారు. ఈ ట్రస్టులో ఇతర ట్రస్టీలుగా భాజపా నేత ఎల్‌కే ఆడ్వాణీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తదితరులు ఉన్నారు.

ఇదీ చదవండి:'మిషన్​ బంగాల్'​పై భాజపా కీలక భేటీ

ABOUT THE AUTHOR

...view details