తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అప్పట్లో పావురాలు వదిలేవారు.. ఇప్పుడు చీతాలను వదులుతున్నాం'

భారత రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు గత ఎనిమిదేళ్లలో ఎనిమిది రెట్లు పెరిగాయని ప్రధాని మోదీ తెలిపారు. దేశం చాలా ముందడగు వేసిందని, ఒకప్పుడు పావురాలను వదిలేవాళ్లమని, ఇప్పుడు చీతాలను వదులుతున్నామని ఆయన అన్నారు. గుజరాత్​లోని గాంధీనగర్​లో ఏర్పాటు చేసిన డిఫెన్స్​ ఎక్స్​పో-2022ను ప్రారంభించిన ఆయన.. పలు వ్యాఖ్యలు చేశారు.

modi inaugurated defence expo at gandhi nagar gujarat
modi inaugurated defence expo at gandhi nagar gujarat

By

Published : Oct 19, 2022, 11:52 AM IST

PM Modi Defence Expo: దేశ ఆయుధ సంపత్తి, సైనిక శక్తి సామర్థ్యాలను కళ్లకు కట్టినట్లు చూపించే ఉద్దేశంతో.. గుజరాత్​లోని గాంధీనగర్​లో ఏర్పాటు చేసిన డిఫెన్స్‌ ఎక్స్‌పో-2022ను ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు కీలక ప్రాజెక్టులకు ఆయన శ్రీకారం చుట్టారు. దీసా ఎయిర్​బేస్​కు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన ప్రసంగించారు.

"భారత రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు గత ఎనిమిదేళ్లలో ఎనిమిది రెట్లు పెరిగాయి. దేశం చాలా ముందడగు వేసింది. ఒకప్పుడు గాల్లోకి పావురాలను వదిలేవారు. ఇప్పుడు చీతాలను విడిచిపెడుతున్నాం. కేవలం భారతీయ కంపెనీలు మాత్రం పాల్గొనే తొలి డిఫెన్స్​ ఎక్స్​పో ఇది. ఉత్తర గుజరాత్‌లో నిర్మించే దీసా వద్ద కొత్త ఎయిర్‌బేస్.. దేశ భద్రతకు సమర్థవంతమైన కేంద్రంగా ఆవిర్భవిస్తుంది. త్వరలోనే 101 రక్షణ పరికరాల దిగుమతులపై నిషేధం విధిస్తాం. వీటిని భారత్​లోనే తయారుచేసి వినియోగించుకోవాలి. అంతర్జాతీయ భద్రతతో పాటు స్వేచ్ఛా వాణిజ్యం కోసం మొత్తం ప్రపంచానికి సముద్ర భద్రత ప్రాధాన్యంగా మారింది."
-ప్రధాని మోదీ

భారతదేశాన్ని బలమైన, స్వావలంబన కలిగిన దేశంగా మార్చాలనే ప్రధాని మోదీ దార్శనికతకు అనుగుణంగా ఈ ఎక్స్​పో నిర్వహిస్తున్నామని రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ తెలిపారు. రాబోయే 25 ఏళ్లలో ప్రపంచానికి రక్షణ తయారీ కేంద్రంగా భారత్​ మారాలనే మా దృఢ సంకల్పాన్ని ఈ ఎక్స్​పో ప్రతిబింబిస్తుందని ఆయన ఉద్ఘాటించారు.

'పాత్ టు ప్రైడ్' కాన్సెప్ట్​లో భాగంగా నిర్వహిస్తున్న ఈ ఎక్స్​పోలో ఇంత వరకు ఎన్నడూ లేనంత పెద్ద సంఖ్యలో స్టాల్స్​ కొలువుదీరబోతున్నాయి. ఈ ఎక్స్‌పోలో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన అధునాతన ఆయుధ వ్యవస్థ, అంతర్గత భద్రతావ్యవస్థలు, సాంకేతికతను ప్రదర్శించనున్నారు. డీఆర్​డీఓ నేతృత్వంలో అనేక భారతీయ పరిశ్రమలు ఈ ఎక్సోపోలో తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి. ఈ ఎక్స్‌పో చివరి రెండు రోజుల్లో (అక్టోబర్ 21- 22) ప్రజల కోసం తెరవనన్నారు.

ఇవీ చదవండి:భారీ వర్షాలు.. కుప్పకూలిన మైసూర్​ ప్యాలెస్​ గోడ.. అధికారుల నిర్లక్ష్యం వల్లే!

యూపీ కూలీల హత్య.. అరెస్టైన హైబ్రిడ్ ఉగ్రవాది హతం.. ఎలాగంటే?

ABOUT THE AUTHOR

...view details