Modi in Varanasi: ఉత్తర్ప్రదేశ్లో రెండు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టును ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ ప్రాజెక్టులో భాగంగా వారణాసికి చేరుకున్న మోదీ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వారణాసిలో సోమవారం క్షణం తీరిక లేకుండా గడిపిన మోదీ.. ఉదయం నుంచి సాయంత్రం వరకు నాలుగు రకాల దుస్తులను ధరించి.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
వారణాసి పర్యటనలో మోదీ ఎన్ని దుస్తులు మార్చారంటే? - కాశీ విశ్వనాథ్ కారిడార్
Modi in Varanasi: కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టును సోమవారం ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు రకాల దుస్తులను ధరించి.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు మోదీ.
వారణాసి పర్యటనలో మోదీ
సోమవారం ఉదయం వారణాసికి పొడవాటి ఖాకీ రంగు కుర్తా, లేత గోధుమరంగు శాలువాతో వచ్చారు. మోదీని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందిబెన్ పటేల్ స్వాగతం పలికారు. అనంతరం కాల భైరవ ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆ తర్వాత కాషాయ దుస్తులు ధరించి గంగానదిలో పుణ్య స్నానాల ఆచరించారు. అనంతరం కాశీ విశ్వనాథుడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Last Updated : Dec 13, 2021, 10:49 PM IST