అమెరికా పర్యటనను(Modi in USA) దిగ్విజయంగా ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ స్వదేశం చేరుకున్నారు. మొత్తం అమెరికాలో(Modi visit to US) ఉన్న 65 గంటల్లో ప్రధాని.. బిజీ షెడ్యూల్‌తో తీరిక లేకుండా గడిపారు. ఈ సమయంలో.. 20 సమావేశాలకు హాజరయ్యారు మోదీ. ఇంకా మార్గమధ్యంలో(విమాన ప్రయాణంలో) అధికారులతో నాలుగు సుదీర్ఘ సమావేశాలు జరిపినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
Modi in USA: 65 గంటల్లో 20 సమావేశాలు- అమెరికాలో బిజీబిజీగా మోదీ - Joe Biden MODI
భారత ప్రధాని నరేంద్ర మోదీ 3 రోజుల అమెరికా పర్యటన (Modi in USA) ఫలప్రదంగా సాగింది. ఆదివారం.. భారత్‌కు చేరుకున్న ఆయనకు భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు నేతలు ఘనస్వాగతం పలికారు. పర్యటనలో (Modi visit to US) భాగంగా ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంతో పాటు క్వాడ్ సదస్సులో (Quad summit) పాల్గొన్నారు మోదీ. అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్ (Biden news) సహా వివిధ దేశాధినేతలతో సమావేశమయ్యారు.
యూఎస్‌లో బిజీబిజీగా మోదీ, modi, pm modi
ప్రధాని 3 రోజుల అమెరికా పర్యటన సాగిందిలా..
- సెప్టెంబర్ 22న మోదీ.. అమెరికా పర్యటనకు(Modi in USA) బయల్దేరారు. వెళ్లే దారిలో ఫ్లైట్‌లో రెండు సమావేశాల్లో పాల్గొన్నారు. అమెరికాకు చేరాక.. హోటల్లో మరో 3 భేటీలు నిర్వహించారు.
- వాషింగ్టన్‌లోని ఆండ్రూస్ జాయింట్ ఎయిర్ ఫోర్స్ బేస్‌కు చేరుకున్న ప్రధానికి.. భారీ సంఖ్యలో తరలివచ్చిన ఎన్ఆర్ఐలు ఘనస్వాగతం పలికారు.
- సెప్టెంబర్ 23న అమెరికాలో(Modi visit to US) ఐదు సంస్థల సీఈఓలతో వేర్వేరుగా సమావేశమయ్యారు.
- అదే రోజు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో శ్వేతసౌధంలో భేటీ అయ్యారు. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, జపాన్ ప్రధాని యోషిహిడే సుగాతో విడివిడిగా ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. మరో మూడు అంతర్గత సమావేశాలకు కూడా మోదీ(Modi news) అధ్యక్షత వహించారు.
- సెప్టెంబర్ 24న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో (Biden news) తొలిసారి భేటీ అయ్యారు మోదీ. వ్యూహాత్మక సంబంధాల బలోపేతం గురించి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రక్షణ, భద్రత, వాణిజ్యం సహా పలు కీలక రంగాల్లో అభివృద్ధిపై చర్చించారు. ఉగ్రవాద నిర్మూలన సహా అఫ్గాన్‌లో పరిణామాలపై సమాలోచనలు చేశారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.అదే రోజు మరో నాలుగు అంతర్గత సమావేశాలు నిర్వహించారు.
- సెప్టెంబర్ 24న బైడెన్ అధ్యక్షతన జరిగిన క్వాడ్(అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా దేశాల కూటమి) సమావేశానికి (Quad summit) హాజరయ్యారు. ఇతర దేశాలకు వ్యాక్సిన్ అందించాలని క్వాడ్ దేశాలు తీసుకున్న చొరవ.. ఇండో పసిఫిక్ దేశాలకు సాయంగా ఉంటుందని అన్నారు మోదీ(Modi news). ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సెప్టెంబర్ 25న వాషింగ్టన్ నుంచి న్యూయార్క్ చేరుకున్న భారత ప్రధాని.. ఐక్యరాజ్యసమితి 76వ సర్వసభ్య సమావేశంలో (Modi UNGA 2021) పాల్గొన్నారు. భారత్‌లో వేల ఏళ్లుగా ప్రజాస్వామ్య పరంపర కొనసాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పేర్కొన్నారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఐరాస సమావేశం అనంతరం.. అదే రోజు అమెరికా నుంచి తిరిగి భారత్‌కు బయల్దేరారు. ఈ మార్గమధ్యంలో విమానంలో రెండు సమావేశాలు నిర్వహించారు.
- సెప్టెంబర్ 26న భారత్‌కు చేరుకున్నారు. దిల్లీ విమానాశ్రయంలో దిగిన మోదీకి.. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు నేతలు ఘనస్వాగతం పలికారు. పార్టీ నేతలు ఏర్పాటు చేసిన అభినందన సభలో మోదీని.. గజమాలతో సత్కరించారు.
- పర్యటన మొత్తం పక్కా ప్రణాళికతో షెడ్యూల్ చేసుకున్న ప్రధాని(Modi in USA).. కీలక భేటీల్లో పాల్గొని పూర్తి సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు.
ఇవీ చూడండి: Modi UNGA 2021: ఐరాసలో మోదీ కీలకప్రసంగం.. ఆ ఘనత భారత్‌దే
Last Updated : Sep 26, 2021, 4:05 PM IST