తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'గ్రామీణ ప్రాంతాల్లో కరోనా కట్టిడికి ప్రత్యేక శ్రద్ధ' - కరోనా మోదీ

ఇంటింటికీ కరోనా పరీక్షలు నిర్వహించటంపై దృష్టి సారించాలని అధికారులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ వనరులను పెంచాలని తెలిపారు. పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న ప్రాంతాల్లో కొవిడ్​ పరీక్షలను మరింత పెంచాలని సూచించారు. దేశంలో కరోనా పరిస్థితులపై ఉన్నత స్థాయి అధికారులతో మోదీ సమీక్ష నిర్వహించారు.

modi review
మోదీ సమీక్ష

By

Published : May 15, 2021, 12:04 PM IST

Updated : May 15, 2021, 10:01 PM IST

గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ వనరులను పెంచాలని అధికారులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశించారు. ఇంటింటికీ కరోనా పరీక్షలు నిర్వహించటం, పర్యవేక్షణ చేయటంపై దృష్టి సారించాలని తెలిపారు. దేశంలో కరోనా పరిస్థితులపై అధికారులతో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న ప్రాంతాల్లో కొవిడ్​ పరీక్షలను మరింత పెంచాలని అధికారులకు మోదీ సూచించారు. స్థానికంగా కంటెయిన్​మెంట్​ జోన్ల ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని రోగులకు ఆక్సిజన్​ పంపిణీ ప్రక్రియ సక్రమంగా జరగాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో కరోనా కట్టడిలో భాగంగా అంగన్​వాడీ, ఆశా కార్యకర్తలను అన్ని రకాల సాధనాలను సమకూర్చాలని చెప్పారు. ఆరోగ్య సిబ్బందికి వెంటిలేటర్లు, ఇతర పరికరాలను వినియోగించటంలో తగిన శిక్షణ అందించాలని ఆదేశించారు.

మార్చి ప్రారంభంలో వారానికి 50 లక్షలు జరగగా.. ప్రస్తుతం వారానికి 1.3 కోట్ల పరీక్షలు జరుగుతున్నాయని మోదీ ఈ సమావేశంలో పేర్కొన్నారు. కరోనా బాధితులు, మరణాల సంఖ్యను రాష్ట్రాలు పారదర్శకంగా చూపించాలని కోరారు. ప్రస్తుత కరోనా పరిస్థితిని పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ రూపంలో అధికారులు మోదీకి వివరించారు. కొన్ని రోజులుగా పాజిటివిటీ రేటు నెమ్మదిగా తగ్గుతూ వస్తోందని, అదే సమయంలో రికవరీ రేటు బాగుందని తెలిపారు. రాష్ట్రాల వారీగా కరోనా పరీక్షలు, ఆక్సిజన్‌ వివరాలు, మౌలిక సదుపాయాలు, వ్యాక్సిన్‌ రోడ్‌ మ్యాప్‌ను మోదీకి అధికారులు వివరించారు.

ఆ ఆరోపణలపై మోదీ సీరియస్

వెంటిలేటర్ల పనితీరుపై పలు రాష్ట్రాల నుంచి వస్తున్న ఆరోపణలను ప్రధాని తీవ్రంగా పరిగణించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తోన్న ఈ వెంటిలేటర్లపై తక్షణమే ఆడిట్ నిర్వహించాలని ఆదేశించారు. అలాగే సరిగా పనిచేస్తున్న వెంటిలేటర్ల విషయంలో అవసరమైతే ఆరోగ్య కార్యకర్తలకు కొత్తగా శిక్షణ ఇవ్వాలని సూచించారు.

పీఎం కేర్స్ నిధులతో పలు రాష్ట్రాలకు కేంద్రం వెంటిలేటర్లను సరఫరా చేసింది. అయితే రాజస్థాన్‌, పంజాబ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఆ వెంటిలేటర్లలో సమస్య తలెత్తినట్లు వార్తా కథనాలు వెల్లడించాయి. ఈ వ్యవహారంపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ట్విటర్‌లో పేర్కొన్నారు. వాటి సేకరణపై కేంద్ర ఆరోగ్య శాఖ వెంటనే దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి:భూటాన్​ ప్రధానికి మోదీ ధన్యవాదాలు

Last Updated : May 15, 2021, 10:01 PM IST

ABOUT THE AUTHOR

...view details