తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రధాని మోదీ చెక్క భజన.. గురు రవిదాస్ ఆలయంలో...

Modi Guru Ravidas: దిల్లీ కరోల్​బాఘ్​లోని శ్రీ గురు రవిదాస్ విశ్రమ్ ధామ్​ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందర్శించారు. మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన.. కీర్తనలో పాల్గొన్నారు.

MODI GURU RAVI DAS
MODI GURU RAVI DAS

By

Published : Feb 16, 2022, 10:27 AM IST

Updated : Feb 16, 2022, 11:24 AM IST

గురు రవిదాస్ ఆశ్రమంలో ప్రధాని మోదీ

Modi Guru Ravidas: గురు రవిదాస్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిల్లీలోని శ్రీ గురు రవిదాస్ విశ్రమ్ ధామ్ మందిరాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు.

గురు రవిదాస్ ధామ్​లో మోదీ

PM Modi prayers Guru Ravi das Dham

అనంతరం.. విశ్రమ్ ధామ్ మందిరంలో నిర్వహించిన 'షాదాబ్ కీర్తన్​'లో మోదీ ఉత్సాహంగా పాల్గొన్నారు. సంప్రదాయ వాద్య పరికరాన్ని చేతిలో పట్టుకొని.. గురు రవిదాస్​ను కీర్తించారు.

మోదీ ప్రార్థన

అంతకుముందు.. గురు రవిదాస్ తన జీవితాన్ని సమాజంలోని దురాచారాలను రూపుమాపేందుకు అంకితం చేశారని మోదీ ట్వీట్ చేశారు. అంటరానితనంపై పోరాడారని చెప్పారు. తమ ప్రభుత్వం ప్రతి పథకాన్ని ఆయన స్ఫూర్తితోనే అమలు చేస్తోందని తెలిపారు.

హారతి ఇస్తూ...

పంజాబ్​లోని లక్షలాది మంది ప్రజలు గురు రవిదాస్​ జయంతిని ఘనంగా జరుపుకొంటారు. ఈ జయంతి కారణంగానే ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సైతం వాయిదా పడ్డాయి. నిజానికి ఫిబ్రవరి 14న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సింది. ఆ రోజున ఎన్నికలు నిర్వహిస్తే చాలా మంది తమ ఓటు హక్కును ఉపయోగించుకునే అవకాశం ఉండదని రాజకీయ పార్టీలు ఈసీ దృష్టికి తీసుకెళ్లాయి. దీంతో ఎలక్షన్ తేదీని మార్చుతూ ఈసీ నిర్ణయం తీసుకుంది.

మరోవైపు, బుధవారం పంజాబ్​లో భాజపా తరఫున ఎన్నికల ప్రచారంలో మోదీ పాల్గొననున్నారు. పఠాన్​కోట్​లో బహిరంగ సభను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. ఉత్తర్​ప్రదేశ్​లోని సీతాపుర్​లోనూ ప్రచారం నిర్వహిస్తారు.

ఇదీ చదవండి:పంజాబ్​లో డేరాల మద్దతు కోసం రాజకీయ పార్టీల తహతహ

Last Updated : Feb 16, 2022, 11:24 AM IST

ABOUT THE AUTHOR

...view details