జపాన్ తదుపరి ప్రధానిగా ఎన్నికైన ఫుమియో కిషిడాకు భారత ప్రధాని నరేంద్ర మోదీ(modi news today) శుభాకాంక్షలు తెలిపారు. భారత్-జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు కలిసి పనిచేయడానికి తాను ఎదురుచూస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు.
"జపాన్ నూతన ప్రధాన మంత్రి ఫుమియో కిషిడాకు శుభాకాంక్షలు. భారత్-జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి, మన ప్రాంతంలో శాంతి, శ్రేయస్సు కోసం ఆయనతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాను."