తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సెమీకండక్టర్స్​పై కేబినెట్​ నిర్ణయం.. ఆవిష్కరణలకు ఊతం' - సెమీకండక్టర్ల తయారీ

Modi cabinet meeting decision: సెమీకండక్టర్స్​ తయారీపై కేంద్ర మంత్రివర్గం బుధవారం తీసుకున్న నిర్ణయం.. కొత్త ఆవిష్కరణలు, పరిశోధనలను ప్రోత్సహించటంతోపాటు.. తయారీని పెంచుతుందని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రూ.76వేల కోట్ల పథకానికి కేబినెట్​ ఆమోదం తెలిపిన క్రమంలో ఆత్మనిర్భర్​ భారత్​ కార్యక్రమాన్ని ఇది బలోపేతం చేస్తుందని ట్వీట్​ చేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
PM Modi

By

Published : Dec 15, 2021, 8:15 PM IST

Modi cabinet meeting decision: సెమీకండక్టర్స్​పై కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం ఆ రంగంలో పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. తయారీని పెంచటం ద్వారా ఆత్మనిర్భర్​ భారత్​ కార్యక్రమం బలోపేతమవుతుందని ట్వీట్​ చేశారు మోదీ.

" సెమీకండక్టర్స్​పై ఈరోజు మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం.. ఆ రంగంలో పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది. అలాగే.. తయారీని పెంచుతుంది. ఆత్మనిర్భర్​ భారత్​ కార్యక్రమాన్ని బలోపేతం చేస్తుంది."

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

భారత్​ను హైటెక్​ ఉత్పత్తికి ప్రపంచ కేంద్రంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా సెమీకండక్టర్ల అభివృద్ధి, తయారీ పర్యావరణ వ్యవస్థ కోసం.. రూ.76వేల కోట్లతో కూడిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకానికి కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. రోజువారీ జీవితంలో ఎలక్ట్రానిక్స్​ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో వాటి తయారీలో సెమీకండక్టర్​ చిప్పులు కీలక భాగమని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్​ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోటీని తట్టుకునేలా దేశీయ సెమీకండక్టర్స్​ కంపెనీలకు ప్రోత్యాహక ప్యాకేజీని అందించటం ద్వారా.. ఈ పథకం ఎలక్ట్రానిక్స్​ తయారీలో కొత్త శకానికి నాంది పలుకుతుందన్నారు. ఇది వ్యూహాత్మక ప్రాముఖ్యత, ఆర్థిక స్వావలంబన దిశగా దేశ సాంకేతిక నైపుణ్యాన్ని బలోపేతం చేస్తుందని తెలిపారు.

అలాగే.. యూపీఐ, రుపీ డెబిట్​ కార్డుతో జరిపిన డీజిటల్​ లావాదేవీలకు సంబంధించి రూ.1300 కోట్ల రీఎంబర్స్​మెంట్​ చేసేందుకు కేబినెట్​ ఆమోదం తెలిపింది. నవంబర్​ నెలలో రూ. 7.56 లక్షల కోట్ల విలువైన 423 కోట్ల డిజిటల్​ లావాదేవీలు జరిగినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. డిజిటల్​ చెల్లింపులను ప్రోత్సహించేందుకు వచ్చే ఏడాది రూ.13వందల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు చెప్పారు.

ఇదీ చూడండి:

ఆన్​లైన్ ట్రాన్సాక్షన్ ఛార్జీల రీఫండ్​- కేంద్రం కీలక నిర్ణయం

ABOUT THE AUTHOR

...view details