తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లైవ్​ అప్​డేట్స్​: కేంద్ర మంత్రులకు శాఖలు కేటాయింపు - cabinet reshuffle

union cabinet reshuffle
కేబినెట్ మార్పులు

By

Published : Jul 7, 2021, 5:44 PM IST

Updated : Jul 7, 2021, 10:33 PM IST

22:00 July 07

మంత్రులకు శాఖలు కేటాయింపు.. 

మంత్రి వర్గం విస్తరించిన అనంతరం.. కేంద్ర మంత్రులకు శాఖలు కేటాయించింది ప్రభుత్వం. ప్రధాని నరేంద్ర మోదీనే.. శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖను పర్యవేక్షించనున్నారు. 

కేంద్ర హోం మంత్రిగా ఉన్న అమిత్ షా.. కొత్తగా ఏర్పాటైన సహకార మంత్రిత్వ శాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు స్వీకరిస్తారు.

  • జ్యోతిరాదిత్య సింధియా- పౌర విమానయాన శాఖ
  • హర్‌దీప్‌ సింగ్‌ పూరీ - పట్టణ అభివృద్ధి, పెట్రోలియం శాఖ
  • మన్‌సుఖ్‌ మాండవీయ - ఆరోగ్యశాఖ
  • అమిత్‌ షా - హోంశాఖతో పాటు కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన సహకార శాఖ
  • అనురాగ్‌ఠాకూర్‌ - సమాచార, ప్రసారాలు; క్రీడలు
  • పీయూష్‌ గోయల్‌ - వాణిజ్య శాఖకు అదనంగా జౌళి శాఖ
  • అశ్వినీ వైష్ణవ్‌ - రైల్వే, ఐటీ కమ్యూనికేషన్లు
  • భూపేంద్ర యాదవ్‌ -కార్మిక శాఖ
  • పశుపతి కుమార్‌ పారస్‌  - ఆహార శుద్ధి
  • స్మృతి ఇరానీ- మహిళా, శిశుసంక్షేమశాఖ
  • ధర్మేంద్ర ప్రదాన్‌ - విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖ
  • గిరిరాజ్‌ సింగ్‌- గ్రామీణాభివృద్ధి
  • పురుషోత్తం రూపాలా - డెయిరీ, మత్స్య శాఖ

21:05 July 07

కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన కేంద్ర మంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. కలసికట్టుగా.. ఒక బృందంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు.

ప్రమాణ స్వీకారం చేసిన 43 మందిని హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. అందరూ కష్టపడి పనిచేయాలని అమిత్ షా సూచించారు. నూతన మంత్రులతో కలసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు రాజ్​నాథ్ పేర్కొన్నారు.

19:34 July 07

43 మంది మంత్రులుగా ప్రమాణం..

కేంద్ర మంత్రి వర్గ విస్తరణ పూర్తయింది. మొత్తం 43 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్​లో జరిగిన ఈ కార్యక్రమంలో.. మంత్రులతో రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ ప్రమాణస్వీకారం చేయించారు.​ ఇందులో 15 మందికి కేబినెట్​ హోదా దక్కింది. మరో 28 మంది సహాయ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

43 మందిలో 36 మంది కొత్తవారు కాగా, ఏడుగురు పదోన్నతి పొందినవారు ఉన్నారు. 

సహాయ మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, అనురాగ్ ఠాకూర్, పురుషోత్తం రూపాలా, కిరణ్‌ రిజిజు, మన్‌సుఖ్‌ మాండవియా, హరిదీప్‌సింగ్‌ పురీ, రామచంద్ర ప్రసాద్​ సింగ్‌.. కేబినెట్‌ మంత్రులుగా ప్రమాణం చేశారు.

యూపీకే ఎక్కువ..

43 మంది మంత్రుల్లో.. ఉత్తర్​ప్రదేశ్​ నుంచే అత్యధికంగా ఏడుగురు ఉన్నారు. ఆ తర్వాత గుజరాత్​ నుంచి ఐదుగురు మంత్రులు ఉన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, బంగాల్​, బిహార్​ నుంచి ముగ్గురు చొప్పున ప్రాతనిధ్యం దక్కింది.

12 మంది మంత్రుల రాజీనామా..

మంత్రివర్గ విస్తరణకు ముందు.. 12 మంది కేంద్ర మంత్రులు రాజీనామా చేశారు. అందులో ప్రకాశ్​ జావడేకర్​, రవిశంకర్​ ప్రసాద్​, సదానంద గౌడ, రమేశో పోఖ్రియాల్​, హర్షవర్ధన్​ ఉన్నారు.   

19:23 July 07

కేంద్ర మంత్రులుగా మంజుపర మహేంద్రభాయ్‌, జాన్ బర్లా, ఎల్‌.మురుగన్‌, నిశిత్‌ ప్రామాణిక్‌ ప్రమాణ స్వీకారం చేశారు. 

19:19 July 07

కేంద్ర మంత్రులుగా రాజ్‌కుమార్ రంజన్‌సింగ్‌, భారతి పవార్‌, బిశ్వేశ్వర్‌ తుడు, శంతను ఠాకూర్‌, మంజుపర మహేంద్రభాయ్‌ ప్రమాణ స్వీకారం చేశారు.  

19:14 July 07

కేంద్ర మంత్రులుగా ప్రతిమ భౌమిక్‌, సుభాష్ సర్కార్‌, భగవత్‌ కిషన్‌రావ్ కరాడ్‌ ప్రమాణ స్వీకారం చేశారు. 

19:08 July 07

కేంద్ర మంత్రులుగా భగవంత్ ఖూబా, ప్రతిమ భౌమిక్‌, సుభాష్ సర్కార్‌ ప్రమాణ స్వీకారం చేశారు. 

19:00 July 07

కేంద్రమంత్రులుగా బి.ఎల్‌.వర్మ, అజయ్‌కుమార్‌ మిశ్రా, దేవ్‌సింహ్‌ చౌహాన్‌  ప్రమాణం స్వీకారం చేశారు. 

18:56 July 07

కేంద్రమంత్రులుగా ఎ.నారాయణస్వామి, కౌశల్ కిశోర్‌,అజయ్‌ భట్‌ ప్రమాణ స్వీకారం చేశారు. 

18:51 July 07

కేంద్రమంత్రులుగా దర్శన విక్రమ్‌ జర్దోష్‌,మీనాక్షి లేఖి, అన్నపూర్ణాదేవి ప్రమాణ స్వీకారం చేశారు. 

18:48 July 07

కేంద్రమంత్రులుగా శోభా కరంద్లాజే, భానుప్రతాప్‌సింగ్ వర్మ, దర్శన విక్రమ్‌ జర్దోష్‌ ప్రమాణ స్వీకారం చేశారు.

18:42 July 07

కేంద్ర మంత్రులుగా పంకజ్ చౌదరి, అనుప్రియ పటేల్‌, సత్యపాల్‌సింగ్ భగేల్‌ ప్రమాణ స్వీకారం చేశారు. 

18:30 July 07

కేంద్రమంత్రులుగా నారాయణ్ రాణే, శరబానంద సోనోవాల్‌, వీరేంద్ర కుమార్‌, జ్యోతిరాదిత్య సింధియా, రామచంద్ర ప్రసాద్ సింగ్‌, అశ్వినీ వైష్ణవ్‌, పశుపతి కుమార్ పారస్‌, అనురాగ్ ఠాకూర్‌, పంకజ్ చౌదరి, అనుప్రియ పటేల్‌, సత్యపాల్‌సింగ్ భగేల్‌ ప్రమాణ స్వీకారం చేశారు. 

18:23 July 07

హర్దీప్​ సింగ్ పురీ, కిరెణ్ రిజిజు, రాజ్​కుమార్ సింగ్​లు సైతం ప్రమాణస్వీకారం చేశారు. ఇప్పటికే కేంద్ర మంత్రులుగా ఉన్న వీరు కేబినెట్ హోదా దక్కించుకున్నారు. 

18:12 July 07

రాష్ట్రపతి భవన్‌లో కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తున్నారు. శర్బానంద సోనోవాల్‌, వీరేంద్ర కుమార్‌, నారాయణ్ రాణే, జ్యోతిరాదిత్య సింధియా, రామచంద్ర ప్రసాద్ సింగ్‌, అశ్వనీ వైశ్ణవ్​, పశుపతి పరాస్​లు.. కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

18:03 July 07

కేబినెట్ విస్తరణ నేపథ్యంలో కీలక నేతలంతా రాష్ట్రపతి భవన్​కు చేరుకున్నారు. కొత్తగా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్న 43 మంది సహా.. రాజీనామా చేసిన పలువురు నేతలు సైతం ఈ కార్యక్రమానికి విచ్చేశారు. 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ రాష్ట్రపతి భవన్​లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్ట్రపతి సహా అక్కడికి హాజరైన నేతలంతా జాతీయ గీతం ఆలపించారు.

17:11 July 07

కేబినెట్ విస్తరణ లైవ్ అప్​డేట్స్​

కొత్తగా మంత్రివర్గంలోకి రానున్న నేతలతో మోదీ సమావేశం

కేంద్ర కేబినెట్ విస్తరణకు సమయం ఆసన్నమైంది. మోదీ సర్కారు రెండోసారి కొలువుదీరిన తర్వాత జరుగుతున్న తొలి మంత్రివర్గ విస్తరణలో భాగంగా 43 మంది ప్రమాణం చేయనున్నారు. అనేక శాఖలకు కొత్త మంత్రులు రానుండగా.. పలువురు కీలక నేతలు ఇప్పటికే కేబినెట్​ నుంచి వైదొలిగారు.

సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి భవన్‌ వేదికగా జరిగే కార్యక్రమంలో మొత్తం 43 మంది కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం. వీరిలో చాలా మంది కొత్తవారే కాగా.. కొందరు సహాయ మంత్రులు పదోన్నతిపై కేబినెట్‌ మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఇప్పటికే వీరంతా ప్రధాని మోదీ నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు.

మరోవైపు, కేబినెట్ మంత్రులైన రమేశ్ పోఖ్రియాల్, హర్షవర్ధన్, సదానంద గౌడ తమ పదవులకు రాజీనామా చేశారు. కీలక నేతలైన రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జావడేకర్​లు సైతం మంత్రివర్గం నుంచి తప్పుకున్నారు. మొత్తం 12 మంది మంత్రుల రాజీనామాలను రాష్ట్రపతి ఆమోదించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ప్రకటన జారీ చేసింది.

ఇదీ చదవండి: 

Last Updated : Jul 7, 2021, 10:33 PM IST

ABOUT THE AUTHOR

...view details