అమెరికా ప్రెసిడెంట్ ఎలక్ట్.. జో బైడెన్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ అనుకూల సమయాల్లో మాట్లాడతారని కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది. ఫలితంగా అగ్రరాజ్యంతో ద్వైపాక్షిక మద్దతు లభిస్తుందని పేర్కొంది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌ను.. బైడెన్ ఓడించిన కొద్దిరోజులకే విదేశీ వ్యవహారాల అంశం తెరపైకి వచ్చింది. అత్యధిక ఎలక్టోరల్ ఓట్లు సాధించిన బైడెన్‌ను.. మోదీ ట్విట్టర్ వేదికగా అభినందించారని విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ మేరకు బైడెన్‌తో కలిసి ద్వైపాక్షిక సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రధాని ఎదురుచూస్తున్నట్టు చెప్పారు.
భారత్- యూఎస్ సంబంధాలను బలోపేతం చేసేందుకు మాజీ ఉపాధ్యక్షుడిగా బైడెన్ చేసిన కృషిని మోదీ కొనియాడారని చెప్పారు అనురాగ్. ఇరు దేశాల మధ్య ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యానికి అమెరికా ద్వైపాక్షిక మద్దతు ఉంటుందన్నారు.