దీపావళి సందర్భంగా స్వదేశీ వస్తువులనే కొనాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త శక్తిని ఇస్తుందని తెలిపారు. వారణాసిలో అభివృద్ధి కార్యక్రమాలను వర్చువల్ ప్రారంభించిన మోదీ.. దేశ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సందేశం ఇచ్చారు.
"దీపావళి సందర్భంగా దేశంలో స్వదేశీ మంత్రం వినిపిస్తోంది. నేను దేశ ప్రజలందరికీ ఓ విషయం చెప్పాలనుకుంటున్నా. దీపావళి రూపంలో స్వదేశీ వస్తువులకు ప్రోత్సహం అందించడానికి గొప్ప సమయం దొరికింది. ప్రతి ఒక్కరూ గర్వంగా స్వదేశీ వస్తువులనే కొనుగోలు చేయాలి. వాటి గురించి మాట్లాడాలి. ప్రశంసించాలి. ఇతరులకు చెప్పాలి."