నివర్ తుపాను తమిళనాడును అతలాకుతలం చేసింది. భారీ వర్షాలు, భీకర గాలుల మధ్య తుపాను గురువారంతీరం దాటింది. ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామితో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో సంభాషించారు.
'నివర్' తుపాను బాధితులకు ప్రధాని సాయం - నివర్ తుపాను
నివర్ తుపానుపై తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామితో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో సంభాషించారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై ఆరా తీశారు. నివర్ తుపాను బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ప్రధాని మోదీ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.
నివర్ తుపాను బాధితులకు ప్రధాని సాయం
తుపాను కారణంగా మరణించిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి సహాయ నిధి కింద రూ. 2లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు మోదీ. గాయపడిన ఒక్కొక్కరికి రూ. 50వేల చొప్పున అందిస్తామన్నారు.
ఇదీ చదవండి:చెన్నైకు తప్పిన 'నివర్' గండం!