తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పట్టపగలే సెల్​ఫోన్​​ టవర్​ను ఎత్తుకెళ్లిన దొంగల ముఠా! - టవర్​ను దొంగలించిన ముఠా

సాధారణంగా ఎక్కడైనా డబ్బు, బంగారం, వాహనాలు, విలువైన వస్తువులు చోరీకి గురవుతుంటాయి. అయితే కొందరు దొంగలు ఓ సెల్​ టవర్​ను దొంగలించారు. ఈ ఘటన బిహార్​లో జరిగింది. మరో ఘటనలో కొందరు వ్యక్తులు నకిలీ కాల్​ సెంటర్​ ఏర్పాటు చేసి విదేశాలకు చెందిన వారిని మోసం చేస్తున్నారు.

Mobile Tower Theft In Patna
సెల్​ టవర్​ను ఎత్తుకెళ్లిన దొంగల ముఠా

By

Published : Nov 27, 2022, 7:52 PM IST

Updated : Nov 27, 2022, 8:42 PM IST

బిహార్​లో ఓ దొంగల ముఠా పట్టపగలే సెల్​ఫోన్​​ టవర్​ను​ చోరీ చేసింది. మొబైల్​ సర్వీస్​ ప్రొవైడర్​ అధికారులుగా నటించిన ముఠా.. సెల్​ టవర్​ను దొంగిలించింది. కంపెనీ నష్టాల్లో ఉందని అందుకే టవర్​ తీసివేస్తున్నట్లు.. స్థల యజమానిని నమ్మించి ఈ దొంగతనానికి పాల్పడ్డారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

పట్నా గార్డెన్​బాగ్​లోని కచ్చి తలాబ్​ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సెల్​ టవర్​కు కొన్ని నెలలుగా ఆ కంపెనీ వారు అద్దె చెల్లించడం లేదు. ఈ విషయం తెలుసుకున్న 10-15 మందితో కూడిన ఓ దొంగల ముఠా టవర్​ను దొంగలించడానికి ప్లాన్​ చేసింది. పక్కాప్లాన్​తో ఆ టవర్​ ఏర్పాటు చేసిన స్థలం యజమానితో.. తాము సర్వీస్​ ప్రొవైడర్ అధికారులమని.. కంపెనీ నష్టాల్లో ఉన్నందున అద్దె చెల్లించలేమని చెప్పారు. అందుకే టవర్​ను తొలగించాలనుకుంటున్నట్లు చెప్పగా దానికి భూమి యజమాని అంగీకరించాడు. దీంతో ఆ ముఠా వెంటనే టవర్​ను నేలమట్టం చేసింది. అనంతరం టవర్​ భాగాలను అక్కడ నుంచి ఎత్తుకెళ్లింది.

అమెరికా ప్రజలను మోసం చేస్తున్న నకిలీ కాల్​ సెంటర్​..
అమెరికా ప్రజలను మోసం చేస్తున్న రాజస్థాన్​లో ఓ నకిలీ కాల్ సెంటర్​పై పోలీసులు దాడులు​ చేశారు. అమెజాన్​ పేరుతో నడుస్తున్న ఈ కాల్ సెంటర్​పై పక్కా సమాచారంలో దాడులు నిర్వహించిన పోలీసులు.. 16 మందిని అరెస్ట్​ చేశారు. వీరిలో రాజస్థాన్​కు చెందిన​ వారితో పాటు, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నట్లు గుర్తించారు.

చిత్తోర్​గఢ్​లోని ఓ హోటల్​లో నకిలీ కాల్​ సెంటర్​ను నిర్వహిస్తున్నట్లు పోలీసులకు ఓ వ్యక్తి సమాచారం అందించాడు. ఈ సమాచారంతో రైడ్​ నిర్వహించిన పోలీసులు.. 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. అమెజాన్​ పేరుతో నకిలీ కాల్​ సెంటర్​ను నడుపుతున్నట్లు కొన్ని పత్రాలను గుర్తించారు. ఈ కాల్​ సెంటర్​ ద్వారా అమెరికాలోని ప్రజలు మోసగిస్తున్నారని పోలీసులు తెలిపారు. వారి నుంచి కీలక పత్రాలు, కంప్యూటర్​లు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్లు చిత్తోర్​గఢ్ స్టేషన్​ ఇన్​ఛార్జ్​ విక్రమ్​ సింగ్​ తెలిపారు.

Last Updated : Nov 27, 2022, 8:42 PM IST

ABOUT THE AUTHOR

...view details