Mobile Procession: పిల్లల సంతోషం కోసం తండ్రి ఎలాంటి కష్టనష్టాలనైనా భరిస్తాడు. మధ్యప్రదేశ్‌లోని శివపురి, సత్నాల్లో జరిగిన రెండు ఘటనలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
శివపురిలోని నీలగిరి చౌరాశాలో టీ దుకాణం నిర్వహించే మురారి తన కుమార్తె కోసం మంగళవారం రూ.12,500 విలువైన మొబైల్ ఫోన్ కొన్నారు. దానిని ఇంటికి తెచ్చేందుకు గుర్రపు బండిలో, బ్యాండు మేళం, డీజే ఏర్పాటు చేశారు. తన కుమార్తెకు మొబైల్ ఇచ్చి గుర్రపు బండిపై కూర్చోబెట్టారు. అనంతరం రహదారిపై నృత్యం చేస్తూ ఊరేగింపుగా ఇంటికి తీసుకెళ్లారు. కుటుంబ సంతోషం కోసం మురారి చేసిన పనిపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఊరేగింపు కోసం మురారి ఏకంగా రూ.8,000 ఖర్చు పెట్టడం విశేషం.
"నేను మద్యం సేవిస్తాను. నా ఐదేళ్ల కుమార్తె మొబైల్ కావాలని అడిగింది. ఫోన్ కొనమని పట్టుబట్టింది. కొనిస్తానని ఆమెకు హామీ ఇచ్చాను" అని మురారి చెప్పారు.