తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Mobile Blast In Nashik : బాంబ్​లా పేలిన మొబైల్​ ఫోన్​.. కిటికీలు, సామాన్లు ధ్వంసం.. చుట్టుపక్కల ఇళ్లు కాడా.. - మహారాష్ట్రలో ఫోన్​ బ్లాస్ట్ ముగ్గురికి తీవ్రగాయాలు

Mobile Blast In Nashik : ఛార్జింగ్​లో పెట్టిన మొబైల్​ ఫోన్​ ఒక్కసారిగా బ్లాస్ట్ అవ్వడం వల్ల ఇంటి కిటికీలు, అద్దాలు ధ్వంసమయ్యాయి. అంతేకాకుండా చుట్టుపక్కల ఇళ్ల అద్దాలు, తలుపులు కూడా దెబ్బతినడం గమనార్హం. ఈ ఘటన మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా​లో జరిగింది.

Nashik Mobile Blast News
Mobile Blast In Nashik

By ETV Bharat Telugu Team

Published : Sep 27, 2023, 3:43 PM IST

Updated : Sep 27, 2023, 4:16 PM IST

Mobile Blast In Nashik :ఛార్జింగ్​లో పెట్టిన మొబైల్​ ఫోన్​ ఒక్కసారిగా పేలడం వల్ల ఇంటి కిటికీలు, సామగ్రి ధ్వంసమయిన ఘటన మహారాష్ట్రలోని నాసిక్​ జిల్లాలో జరిగింది. అంతేకాకుండా చుట్టుపక్కల ఇళ్ల అద్దాలు, తలుపులు కూడా తీవ్రంగా దెబ్బతినడం గమనార్హం. కేవలం మొబైల్​ ఫోన్​ పేలుడుకే ఇంత పెద్దమొత్తంలో నష్టం వాటిల్లడం చూసిన స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ ఘటనలో ఇంట్లో నివాసం ఉంటున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

చుట్టుపక్కల ఇళ్లు కూడా..
తుషార్​ జగ్​తాప్​, శోభా జగ్​తాప్​, బాలకృష్ణ సుతార్​ కలిసి నాసిక్​ ప్రతాప్​నగర్​లోని సిడ్కో ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. సెప్టెంబర్​ 27న ఈ ముగ్గురిలో ఒకరు తమ మొబైల్​ ఫోన్​ను ఛార్జింగ్​ పెట్టారు. ఉన్నట్టుండి బుధవారం ఉదయం ఛార్జింగ్​ పెట్టిన ఫోన్​ భారీ శబ్దంతో పేలింది. ఈ పేలుడు ధాటికి ఇంట్లోనే ఉన్న ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న స్థానికులు గాయపడిన వారిని దగ్గర్లోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

ఫోన్​ పేలుడు ధాటికి ధ్వంసమైన ఇంట్లోని సామగ్రి.
ఫోన్​ పేలుడు ధాటికి ధ్వంసమైన ఇంట్లోని సామగ్రి.
దెబ్బతిన్న ఇంటి కిటికీలు.

జేబులో పేలిన కీప్యాడ్​​ ఫోన్​!
ఇటీవలే కేరళలోని త్రిస్సూర్​ నగరంలో 76 ఏళ్ల ఇలియాస్ అనే వృద్ధుడి జేబులో ఉన్న కీ ప్యాడ్​ ఫోన్​ ఉన్నట్టుండి పేలిపోయింది. దీంతో అతడి షర్ట్​కు ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన వృద్ధుడు జేబులో నుంచి ఫోన్​ను తీసి కిందకు విసిరేశాడు. అనంతరం మొబైల్​కు అంటుకున్న మంటలను ఆర్పేశాడు. దీంతో పెద్ద ప్రాణాపాయం తప్పింది. ఇలియాస్​ ఓ హోటల్లో టీ తాగుతూ కూర్చున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఇక ఈ ఘటనకు సంబంధించి లైవ్​ వీడియో అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ఆ వీడియో కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

మొబైల్ పేలిందని కోర్టులో దావా!
కొద్దనెలల క్రితమే కేరళలోని కోజికోడ్​లో కూడా ఈ తరహా ఘటనే వెలుగు చూసింది. 23 ఏళ్ల ఫారిస్ రెహమాన్​ అనే యువకుడు జీన్స్​ ప్యాంట్​ జేబులో పెట్టుకున్న మొబైల్ ఫొన్​ అకస్మాత్తుగా బ్లాస్ట్​ అయింది. దీంతో అతడు ధరించిన జీన్స్​ ప్యాంట్​కు మంటలు అంటుకొని మొబైల్​ పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనలో అతడికి స్వల్ప గాయాలు అయ్యాయి. కాగా, పేలుడుపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాధిత యువకుడు.. తయారీ సంస్థపై వినియోగదారుల కోర్టులో ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపాడు. ఈ వార్త పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.


Train Hits Platform Viral Video : బ్రేకులు ఫెయిల్​.. ప్లాట్​ఫాంపైకి దూసుకొచ్చిన రైలు.. లక్కీగా..

Termites Eat Money : బ్యాంక్​ లాకర్​లో 'చెదలు'.. రూ.18లక్షలు స్వాహా.. ఆమెకు ఆ విషయం తెలియదట!

Last Updated : Sep 27, 2023, 4:16 PM IST

ABOUT THE AUTHOR

...view details