Mob sets houses on fire: ఓ వర్గానికి చెందిన యువతిని కిడ్నాప్ చేశాడనే కోపంతో ఆమె ప్రేమించిన యువకుడికి చెందిన రెండు ఇళ్లకు నిప్పంటించారు 'ధరమ్ జాగరణ్ సమన్వయ్ సంఘ్' సభ్యులు. ఈ దాడికి పాల్పడిన ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాలో శుక్రవారం జరిగింది.
ఆగ్రాలోని రునక్తా ప్రాంతంలో జిమ్ యజమాని సాజిద్ ఇంటిని ఓ సమూహం తగలబెట్టిందని పోలీసులు తెలిపారు. ఈయన ఇంటి పక్కనే ఉన్న ఇంటికి కూడా ఈ గుంపు నిప్పు పెట్టిందని వెల్లడించారు. 22 సంవత్సరాల యువతిని.. సాజిద్ కిడ్నాప్ చేసినందుకు ఆయనను అరెస్టు చేయాలని వీళ్లు డిమాండ్ చేశారు. స్థానిక రునక్తా మార్కెట్‌లోని దుకాణాలు మూసేసి వ్యాపారులూ వీరికి సంఘీభావం ప్రకటించారు.
11వ తరగతి చదువుతున్న యువతి సోమవారం అదృశ్యమైంది. దీంతో ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. రెండు రోజులు తరువాత ఆమెను పోలీసులు పట్టుకున్నారు. ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సాజిద్ ఆచూకీ ఇంకా తెలియలేదు. అయితే తాను మేజర్‌నని, ఇష్టపూర్వకంగానే సాజిద్ వద్దకు వెళ్లినట్టు యువతి సోషల్ మీడియాలో ఒక వీడియో ద్వారా తెలిపింది. ఆ మహిళ తాను మేజర్ని అని.. సాజిద్‌తో ఇష్టపూర్వకంగానే వెళ్లినట్లు తెలిపింది.