ఝార్ఖండ్లో ఓ సైకోప్రేమికుడిని కొట్టి చంపారు గ్రామస్థులు. ఈ ఘటన గొడ్డా జిల్లా రాజ్బితా పోలీస్స్టేషన్ పరిధిలోని చాంద్నా గ్రామంలో జరిగింది.
ఏమైందంటే..?
చాంద్నా గ్రామానికి చెందిన మున్నా పహాడియా.. ఓ యువతిని ప్రేమించాడు. అతడి ప్రేమను ఆ యువతి నిరాకరించింది. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్న మున్నా.. అర్ధరాత్రి యువతి ఇంట్రో దూరి ఆమెను కత్తితో దాడి చేశాడు. అనంతరం పరారయ్యేందుకు యత్నించిన మున్నాను గ్రామస్థులు పట్టుకొని చితకబాదారు. నిందితుడు అపస్మారక స్థితిలోకి వెళ్లటంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మున్నా మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. గాయపడ్డ బాధితురాలు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.