ఝార్ఖండ్ బొకారోలో దారుణం జరిగింది. మహుటాండ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధ్వయ అనే గ్రామంలో ఓ వ్యక్తిపై మూకదాడి జరిగింది. ఈ ఘటనలో 45 ఏళ్ల వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం ఆస్పత్రికి తరలించేసరికి మృతి చెందాడు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని పోలీసులు తెలిపారు. మృతుడు వార్డు మెంబర్ అని పేర్కొన్నారు. గురువారం జరిగిన దుర్గాదేవీ నిమజ్జనం సమయంలో ఓ వర్గానికి చెందిన 22 మంది మరో వర్గానికి చెందిన వ్యక్తిపై దాడి చేశారు. ఫలితంగా గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడం వల్ల పోలీసులు భారీగా మోహరించారు. ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. మృతుడికి ధ్వయ గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. కొందరు గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేసి దుర్గామాత నిమజ్జనం సమయంలో అదును చూసి మూకదాడికి పాల్పడ్డారు. బాధితుడికి తీవ్ర గాయలవ్వగా.. రామ్‌ఘఢ్ ఆసుపత్రిలో పోలీసులు చేర్చారు. బాధితుడి ఆరోగ్యం విషమించడం వల్ల రాంచీలోని ఓ ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అతడు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ కేసులో 22 మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్నారు. అందులో 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారికోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.
కిడ్నాప్ చేసి..
ఉత్తర్‌ప్రదేశ్ ఝాన్సీలో దారుణం జరిగింది. ఓ మైనర్‌ను కిడ్నాప్ చేసి.. నాలుగు రోజులు బందీగా ఉంచి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు నలుగురు కామాంధులు. నిందితులను కాపాడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని బాధితురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.