తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ వీడియోలతో ఎమ్మెల్యేకు బెదిరింపులు.. రూ.లక్ష డిమాండ్​.. చివరకు...

ఎమ్మెల్యే వాట్సాప్​ నంబర్​ను సంపాదించి వీడియో కాల్​ చేశాడు ఓ వ్యక్తి. వాట్సాప్​, ఫేస్​బుక్​లో అసభ్యకరమైన మెసేజ్​లు పంపాడు. ఆ తర్వాత రూ.లక్ష ఇవ్వకపోతే రికార్డ్​ చేసిన వాట్సాప్ వీడియోకాల్​ను అందరికీ పంపిస్తానని బెదరింపులకు పాల్పడ్డాడు. చివరకు ఏమైందంటే?

mla-was-tricked-into-sextortion-case-by-making-obscene-video-calls-accused-arrested-from-rajasthan
mla-was-tricked-into-sextortion-case-by-making-obscene-video-calls-accused-arrested-from-rajasthan

By

Published : Feb 11, 2023, 2:32 PM IST

మహారాష్ట్ర.. మోహోల్​ ఎమ్మెల్యే యశ్వంత్​ విఠల్​ మానేకు వింత అనుభవం ఎదురైంది. సోషల్​మీడియాలో ఆయన వాట్సాప్​ నంబర్​ సంపాదించిన ఓ వ్యక్తి.. వీడియో కాల్​ చేశాడు. అనంతరం ఆ వీడియో కాల్​ను రికార్డ్​ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. రూ.లక్ష ఇవ్వకపోతే అందరికీ పంపిస్తానని మెసేజ్​ చేశాడు. దీంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు.

అసలేం జరిగిందంటే?
రాజస్థాన్​ భరత్​పుర్​కు చెందిన రిజ్వాన్​ అస్లాం ఖాన్​.. ఎమ్మెల్యే యశ్వంత్ విఠల్​ వాట్సాప్​ నంబర్​ను సోషల్​మీడియా ద్వారా సంపాదించాడు. అనంతరం ఎమ్మెల్యేకు వీడియో కాల్​ చేసి మాట్లాడాడు. వాట్సాప్​, ఫేస్​బుక్​లో అసభ్యకరమైన మెసేజ్​లు కూడా పంపాడు. వాట్సాప్​ వీడియో కాల్​ను రికార్డ్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. రూ.లక్ష ఇవ్వకపోతే అందరికీ షేర్​ చేస్తానని మెసేజ్​ చేశాడు.

ఈ విషయంపై పుణెలో ఉంటున్న ఎమ్మెల్యే యశ్వంత్ విఠల్​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు.. రాజస్థాన్​, భరత్​పుర్​లో ఉన్న నిందితుడిని అరెస్ట్​ చేశారు. అతడి దగ్గర ఉన్న మొబైల్​ ఫోన్​ను స్వాధీనం చేసుకున్నారు. అందులో 90కుపైగా అసభ్యకరమైన వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం అతడిని కోర్టు ముందు హాజరుపరిచారు. నిందితుడికి ఐదు రోజుల కస్టడీ విధించింది కోర్టు. ఈ ఘటనను సీరియస్​గా తీసుకున్న పోలీసులు.. నిందితుడికి ఎవరైనా సహకరించారా అన్న కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు.

నిందితుడిని పట్టుకున్న పోలీసులు

"ఇలాంటి ఘటనలు ఈమధ్య కాలంలో చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. కానీ ఎవరూ ఫిర్యాదు చేయడం లేదు. నా వీడియో కాల్​ను రికార్డ్​ చేసి బెదిరించాడు. డబ్బులు డిమాండ్​ చేశాడు. పోలీసులు అతడిని చాకచక్యంగా పట్టుకుని దర్యాప్తు చేపడుతున్నందుకు నా అభినందనులు. తెలియని ఫోన్ నంబర్​ నుంచి వీడియో కాల్​ వస్తే లిఫ్ట్​ చేయవద్దు. అనుమానం వస్తే సైబర్​ పోలీసులను సంప్రదించండి."
-యశ్వంత్​ విఠల్​ మానే, ఎన్సీపీ ఎమ్మెల్యే

ABOUT THE AUTHOR

...view details