సీఎం యడియూరప్పకు సంబంధించి ఓ సీడీ ఉందని భాజపా ఎమ్మెల్యే పాటిల్ యత్నల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'ఆపరేషన్ కమల్'లో పాల్గొన్న 17 మంది ఎమ్మెల్యేల దగ్గర ఆ సీడీ ఉన్నట్లు తెలిపారు. దానిని ఎప్పుడు ఎవరు ఆయుధంగా వాడుతారో చెప్పలేమని అన్నారు. తన ప్రత్యర్థులు తనను లేకుండా చేయాలని చూశారని కానీ ఆఖరికి వారే 'సున్నా' అయ్యారని తెలిపారు.
'కర్ణాటక సీఎంకు సంబంధించిన సీడీ ఉంది' - లైంగిక ఆరోపణల వివాదంలో కర్ణాటక మంత్రి
కర్ణాటక సీఎం యడియూరప్పకు సంబంధించిన ఓ సీడీపై భాజపా ఎమ్మెల్యే పాటిల్ యత్నల్ సంచలన విషయాలు వెల్లడించారు. ఆపరేషన్ కమల్లో పాల్గొన్న 17మంది ఎమ్మెల్యేల దగ్గర ఆ సీడీ ఉందని, దాన్ని వారు ఎప్పుడు, ఎలా వాడుకుంటారో తెలియదని అన్నారు.

భాజపా ఎమ్మెల్యే పాటిల్ యత్నల్ సంచలన వ్యాఖ్యలు
ఇటీవల ఓ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించారంటూ నీటి పారుదల శాఖ మంత్రి రమేశ్ జర్కిహోళి పై ఆరోపణలు వచ్చాయి. దాంతో ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు సీఎం యడియూరప్పకు సంబంధించిన సీడీ ఉందంటు వార్తలు రావడం కర్ణాటక రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
ఇదీ చదవండి:సీడీ కేసులో కర్ణాటక మంత్రి రాజీనామా