తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి అధిక స్థానాల్లో మెజార్టీలో దూసుకుపోతోంది. సర్వేల అంచనాలను నిజం చేస్తూ అధికార అన్నాడీఎంకే కూటమిపై తిరుగులేని ఆధిక్యాన్ని కనబరుస్తోంది.
కొళత్తూరు నుంచి పోటీ చేసిన డీఎంకే అధినేత స్టాలిన్ ఆధిక్యంలో ఉన్నారు. ఎడప్పాడిలో సీఎం పళనిస్వామి ముందంజలో కొనసాగుతున్నారు. థౌజెండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఖుష్బూ వెనుకంజలో ఉన్నారు.