తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎమర్జెన్సీలో నాన్నే నన్ను పోలీసులకు అప్పగించారు: సీఎం స్టాలిన్‌ - ఇందిరా గాంధీ

MK Stalin Autobiography: ఇందిరా గాంధీ ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీ వేళ తనను తండ్రి కరుణానిధే పోలీసులకు అప్పగించారని తెలిపారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. ఆ సమయంలో చాలా మంది డీఎంకే నేతలు అరెస్టయ్యారని, వారిలో ఒకరిగానే తనను తన తండ్రి భావించారని పేర్కొన్నారు.

mk stalin autobiography
MK Stalin arrest

By

Published : Mar 21, 2022, 5:38 AM IST

MK Stalin Autobiography: ఎమర్జెన్సీ సమయంలో తనను తండ్రి కరుణానిధే పోలీసులకు అప్పగించారని, అందుకు తానేమీ బాధ పడలేదని తమిళనాడు సీఎం స్టాలిన్‌ స్వీయ చరిత్రలో వెల్లడించారు. స్టాలిన్‌ స్వీయ చరిత్ర పుస్తకం 'ఉంగళిల్‌ ఒరువన్‌' (మీలో ఒకడు) పేరిట తొలి భాగాన్ని ఇటీవల ఆవిష్కరించారు. అందులో ఈ విషయం ఉంది.

"ఇందిరా గాంధీ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది. అప్పట్లో పోలీసులు గోపాలపురంలోని కరుణానిధి నివాసానికి వెళ్లి నన్ను అరెస్టు చేయడానికి వచ్చామని, తమవద్ద సెర్చ్‌ వారెంట్‌ ఉందని తెలిపారు. స్టాలిన్‌ మధురాంతకంలో ఉన్నానని, వచ్చిన వెంటనే తెలియజేస్తానని కరుణానిధి వారికి చెప్పి పంపారు. మరుసటి రోజు నేను తిరిగి వచ్చాక పోలీసులకు ఫోన్‌ చేసి నన్ను అరెస్టు చేసి తీసుకెళ్లాలని కరుణానిధి చెప్పారు. దీంతో నన్ను మిసా చట్టం కింద అరెస్టు చేశారు. ఆ సమయంలో చాలా మంది డీఎంకే నేతలు అరెస్టయ్యారు. వారిలో ఒకరిగానే నన్ను నా తండ్రి భావించారు" అని స్వీయ చరిత్రలో స్టాలిన్‌ పేర్కొన్నారు.

ఇదీ చూడండి:'తమిళనాడుతో పాటు దేశ ప్రజలను అవమానించిన మోదీ!'

ABOUT THE AUTHOR

...view details