తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అసోం, మిజోరం చర్చలు- వివాదం సద్దుమణిగేనా? - అసోం న్యూస్​

అసోం, మిజోరం మధ్య కొద్ది రోజుల క్రితం సరిహద్దు వివాదం చెలరేగి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇరు రాష్ట్రాల మధ్య సంబంధాలు తెగిపోయాయి. తాజాగా సరిహద్దు సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు ఇరు రాష్ట్రాలకు ఏకతాటిపైకి వచ్చి.. చర్చలు చేపట్టాయి. ఈ మేరకు సంయుక్త ప్రకటన చేశాయి.

Mizoram, Assam hold talks
అసోం, మిజోరం చర్చలు

By

Published : Aug 5, 2021, 3:36 PM IST

కొద్ది రోజులుగా ఉద్రిక్తత పరిస్థితులకు కారణమైన సరిహద్దు వివాదం పరిష్కారానికి అసోం, మిజోరం రాష్ట్రాలు ఓ అంగీకారానికి వచ్చాయి. ఐజ్వాల్​లో ఇరు రాష్ట్రాల ప్రతినిధులు చర్చలు చేపట్టారు. అంతరాష్ట్ర సరిహద్దు వివాదాన్ని సామర్యంగా పరిష్కరించుకునేందుకు అంగీకరించారు. ఈ క్రమంలోనే.. కొద్ది రోజుల క్రితం మిజోరం సరిహద్దును మూసివేస్తూ ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకుంది అసోం.

సరిహద్దు వివాదంపై చర్చల అనంతరం ఇరు రాష్ట్రాల ప్రతినిధులు సంయుక్త ప్రకటన చేశారు.

ప్రకటనలోని కీలక అంశాలు..

  • అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదం చుట్టూ అల్లకున్న ఉద్రిక్తలు తొలగించేందుకు, చర్చల ద్వారా పరిష్కారం కోసం కేంద్ర హోంశాఖ, ఇరు రాష్ట్రా ముఖ్యమంత్రులు తీసుకున్న నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు అసోం, మిజోరం ప్రతినిధులు నిర్ణయించారు.
  • 2021, జులై 26న జరిగిన అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపారు అసోం, మిజోరం ప్రతినిధులు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
  • అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ప్రశాంత వాతావరణం ఉండేలా చూసేందుకు ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. ఆ దిశగా కేంద్ర బలగాలను మోహరించటాన్ని స్వాగతించాయి. ఈ క్రమంలోనే ఆ ప్రాంతాలకు అటవీ, పోలీసు, పెట్రోలింగ్​ బలగాలను తరలించకూడదని తీర్మానించాయి.
  • సరిహద్దు ప్రాంతాలు సహా ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య శాంతి, సామరస్యం పెంపొందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అసోం, మిజోరం రాష్ట్రాల ప్రతినిధులు ఏకాభిప్రాయానికి వచ్చారు.

జులై 26న జరిగిన ఘర్షణలో ఆరుగురు అసోం పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. 50 మందికిపైగా గాయపడ్డారు.

ఇదీ చూడండి:ఇంకెన్నాళ్లీ రాష్ట్రాల సరిహద్దు వివాదాలు?

రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉద్రిక్తత - 8 మందికి గాయాలు

మళ్ళీ తెరపైకి అసోం-మిజోరం సరిహద్దు వివాదం

ABOUT THE AUTHOR

...view details