దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు జనాభా నియంత్రణపై దృష్టి పెడుతుంటే.. మిజోరంలో(Mizoram Population) మాత్రం పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. స్వయంగా ఆ రాష్ట్ర(Mizoram Population) క్రీడా శాఖ మంత్రి రాబర్ట్ రోమానియా.. అధిక సంతానాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగా.. తన నియోజకవర్గం ఐజ్వాల్ తూర్పు-2 పరిధిలో అధిక సంతానం ఉన్న 17 మంది తల్లిదండ్రులకు దాదాపు రూ.2.5 లక్షల నగదు ప్రోత్సాహకాలు, ప్రశంసాపత్రాలను అందజేశారు.
ఆనాడు చెప్పినట్లుగా..
తన నియోజకవర్గం పరిధిలో అత్యధిక సంతానం ఉన్న తల్లి లేదా తండ్రికి రూ.లక్ష నగదు ప్రోత్సాహకం అందిస్తానని ఫాదర్స్ డే సందర్భంగా జూన్లో రొమావియా వెల్లడించారు. నగదు బహుమతితో పాటు ట్రోఫీ కూడా అందజేస్తానని తెలిపారు. మిజో తెగల్లో జనాభాను(Mizoram Population) పెంచేందుకు తాను ఈ ఆఫర్ ప్రకటించినట్లు వెల్లడించారు. ఆ ప్రకటన మేరకు తాజాగా వారికి ప్రోత్సహకాలు అందించారు.
- 7 మంది కుమారులు సహా 15 మంది సంతానం కలిగిన తుయిథియాంగ్ ప్రాంతానికి చెందిన వితంతువు గౌరువీ.. ఇందులో ప్రథమ బహుమతి గెలుచుకున్నారు. ఆమెకు రూ.లక్ష నగదు బహుమతి, ప్రశంసాపత్రాన్ని రోమానియా అందజేశారు.
- వేంగ్ ప్రాంతానికి చెందిన లియాథాంగీ అనే వితంతువుకు 13 పిల్లలు ఉన్నందున ఆమెకు రూ.30,000 నగదుతోపాటు ప్రశంసాపత్రాన్ని అందించారు.
- 12 మంది సంతానం ఉన్న ఇద్దరు మహిళలు, ఓ పురుషుడికి.. రూ.20,000 చొప్పున నగదు, ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు.
- వీరితో పాటు 8 మంది సంతానం ఉన్న 12 మంది తల్లిదండ్రులకు రూ.5,000 చొప్పున నగదు బహుమతి అందించారు.