దేశవాళీ ఆవులపై జరుగుతోన్న పరిశోధనలను వేగవంతం చేయాలని కేంద్ర శాస్త్ర, సాంకేతిక వ్యవహారాల శాఖ మంత్రి హర్షవర్ధన్ అధికారులకు సూచించారు. ఇంతవరకు జరిగిన పరిశోధనల తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. మూడు నెలలకు ఒకసారి దీనిపై సమీక్ష జరుపుతామని చెప్పారు.
'దేశవాళీ ఆవులపై పరిశోధనలు పెరగాలి'
దేశవాళీ ఆవులు, వాటి ఉత్పత్తులపై పరిశోధనలు మరింత వేగవంతం కావాల్సిన అవసరం ఉందన్నారు కేంద్ర శాస్త్ర, సాంకేతిక వ్యవహారాల శాఖ మంత్రి హర్షవర్ధన్. ఇప్పటివరకూ ఆవులపై నిర్వహించిన పరిశోధనల తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
హర్షవర్ధన్
దేశవాళీ ఆవుల ఉత్పత్తుల వినియోగంపై పరిశోధనలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం 2017లో 'స్వరోప్'(సైంటిఫిక్ వ్యాలిడేషన్ అండ్ రీసెర్చ్ ఆన్ పంచగవ్య) పథకాన్ని ప్రారంభించింది. పంచగవ్యాలైన ఆవు పాలు, నెయ్యి, పెరుగు, మూత్రం, పేడల వినియోగంపై పరిశోధనలు చేయడమే దీని లక్ష్యం.
ఇదీ చదవండి:విదేశీ అధికారులతో మోదీ భేటీలు రద్దు!