బంగాల్ ముఖ్యమంత్రి పీఠమే లక్ష్యంగా యుద్ధప్రాతిపదికన వ్యూహాలు రచిస్తోంది భాజపా. 2021లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం తమ పార్టీలోని అగ్రనేతలను ఇప్పటి నుంచే రంగంలోకి దింపుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా గజేంద్ర షెకావత్, సంజీవ్ బలయాన్, ప్రహ్లాద్ పటేల్, అర్జున్ ముండా, ముకేశ్ మాండవియా బంగాల్లో పర్యటించనున్నారు. అమిత్ షా ఈ వారాంతంలో రాష్ట్రానికి రానుండగా.. ఇతరులు మరికొన్ని రోజుల్లో పర్యటిస్తారు.
ఇప్పటికే ఉత్తర్ ప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య, మధ్యప్రదేశ్ కేబినెట్ మంత్రి నరోత్తమ్ మిశ్రకు బంగాల్ ఎన్నికల బాధ్యతను అప్పగించింది పార్టీ అధిష్ఠానం. వీరంతా ఈ నెల 19న షా నేతృత్వంలో జరగనున్న భేటీకి హాజరుకానున్నారు.