missing boy from Arunachal: అరుణాచల్‌ప్రదేశ్ షియాంగ్ జిల్లాలోని సియుంగ్లా ప్రాంతంలో తప్పిపోయిన 17ఏళ్ల బాలుడి ఆచూకీ కనుగొన్నట్లు చైనా సైన్యం భారత్‌కు తెలిపింది. ఈ విషయాన్ని రక్షణ శాఖ తాజాగా వెల్లడించింది. అధికారిక ప్రక్రియ పూర్తి అయిన తరువాత బాలుడ్ని మన సైన్యానికి అప్పజెప్పనున్నట్లు రక్షణ శాఖ పీఆర్ఓ హర్షవర్ధన్ పాండే తెలిపారు.
తొలుత ఆ యువకుడ్ని చైనా ఆర్మీ కిడ్నాప్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. అనంతరం వారి సాయం కోరినట్లు భారత సైన్యం పేర్కొంది. ప్రోటోకాల్ ప్రకారం అతడిని గుర్తించి.. భారత్‌కు అప్పగించాల్సిందిగా కోరినట్లు తెలిపింది.