తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అరుణాచల్ యువకుడు ఇంటికి.. భారత్​కు అప్పజెప్పిన చైనా.. - అరుణాచల్ ప్రదేశ్ యువకుడు రిలీజ్

Arunachal missing boy released: తప్పిపోయి చైనాలోకి ప్రవేశించిన అరుణాచల్ ప్రదేశ్ యువకుడు సురక్షితంగా భారత్​కు చేరుకున్నాడు. యువకుడిని చైనా సైన్యం.. భారత ఆర్మీకి అప్పగించిందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు.

Arunachal missing boy released
అరుణాచల్ యువకుడు ఇంటికి

By

Published : Jan 27, 2022, 2:55 PM IST

Arunachal missing boy released: అరుణాచల్​ప్రదేశ్​ నుంచి తప్పిపోయి చైనాలోకి ప్రవేశించిన యువకుడు తిరిగి భారత్​కు చేరుకున్నాడు. యువకుడిని చైనా సైన్యం భారత్​కు అప్పగించిందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు.

షియాంగ్ జిల్లాలోని జిడో గ్రామానికి చెందిన ఎస్​హెచ్ మిరాం తరోన్(19)​.. జనవరి 18న తప్పిపోయాడు. అధికారిక ప్రక్రియలతో పాటు, వైద్య పరీక్షలు పూర్తైన తర్వాత యువకుడిని మన సైన్యానికి చైనా పీఎల్ఏ అప్పజెప్పిందని రిజిజు ట్వీట్ చేశారు.

Arunacha pradesh Missing youth

తొలుత యువకుడిని చైనా సైన్యం అపహరించిందని వార్తలు వచ్చాయి. చైనా సైనికుల చెరనుంచి తప్పించుకున్న తరోన్​ స్నేహితుడు.. ఈ విషయాన్ని అధికారులకు చెప్పినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, యువకుడు కిడ్నాప్ కాలేదని, తప్పిపోయాడని అధికారులు తర్వాత వివరణ ఇచ్చారు.

దీనిపై చైనాతో సంప్రదింపులు జరిపినట్లు బుధవారం కేంద్ర మంత్రి రిజిజు పేర్కొన్నారు. యువకుడి ఫొటోలు, ఇతర వివరాలు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీతో పంచుకున్నట్లు చెప్పారు. యువకుడిని భారత్​కు అప్పజెప్పేందుకు చైనా సైన్యం సానుకూలంగా స్పందించిందని తెలిపారు. అతడిని ఏ ప్రాంతంలో విడిచిపెడతామనే వివరాలను తెలియజేసిందని స్పష్టం చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి:పెళ్లైన 6నెలలకే కొడుకు మృతి.. కోడలికి అత్త రెండో పెళ్లి

ABOUT THE AUTHOR

...view details