కాలక్షేపం కోసమో లేక సరాదా కోసమో ప్రారంభించిన పబ్జీ గేమ్.. కన్నడ రాష్ట్రంలో ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. దీని మాయలో పడిన 13ఏళ్ల బాలుడు.. ఇటీవల తప్పిపోయాడు. చివరకు శవమై తేలాడు.
చెట్ల పొదల్లో హకీఫ్ మృతదేహం ఇదీ జరిగింది..
దక్షిణ కన్నడ జిల్లా కేసీ రోడ్లోని హకీఫ్(13) తరచూ పబ్జీ గేమ్ ఆడుతుండేవాడట. అతడు ఇటీవల తప్పిపోయాడు. ఆ తర్వాత హత్యకు గురై.. వాళ్ల ఇంటికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో శవమై కనిపించాడు.
హకీఫ్ తప్పిపోయాడని అతడి తల్లిదండ్రులు ఉల్లాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు వెతికి.. ఆ బాలుడి శవాన్ని గుర్తించారు. పబ్జీ కోసం బాలుడి స్నేహితుల మధ్య తలెత్తిన గొడవే ఈ హత్యకు కారణమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఒంటిపై గాయాలతో పడిఉన్న బాలుడు ఈ పూర్తి వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:30 ఏళ్లుగా 'ఆమె' కేరాఫ్ అడ్రస్ పోలీస్ స్టేషన్!