తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఫోన్​ కోసం దారుణం.. రన్నింగ్​ ట్రైన్​లో యువకుడిపై కాల్పులు.. మైనర్​పై యాసిడ్​ దాడి - కర్ణాటక రామ్​నగర్​ లేటెస్ట్ న్యూస్​

కదులుతున్న ట్రైన్​లో నలుగురు దుండగులు బీభత్సం సృష్టించారు. ఓ యువకుడిపై కాల్పులు జరిపి.. అతడి వద్ద నుంచి మొబైల్​ను లాక్కున్నారు. దీంతో ట్రైన్​లో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ ఘటన బిహార్​లోని వెలుగుచూసింది. మరో ఘటనలో ప్రేమను నిరాకరించిందనే కారణంతో ఓ యువకుడు మైనర్​ విద్యార్థినిపై యాసిడ్​ దాడికి పాల్పడ్డాడు. శుక్రవారం రాత్రి కర్ణాటకలో జరిగిందీ ఘటన.

young man shot in running train
young man shot in running train

By

Published : Feb 18, 2023, 11:01 AM IST

బిహార్​ ఖగాడియాలో జిల్లాలో దుండగులు రెచ్చిపోయారు. కదులుతున్న రైలులో ఓ యువకుడిపై కాల్పులు జరిపి మొబైల్​ను లాక్కున్నారు. దీంతో ఆ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆ కాల్పులతో రైల్లో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి నెలకొంది. వెంటనే నిందితులు అక్కడనుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సమస్తిపుర్​ జిల్లాలోని ఫతేపుర్​ ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల నయన్​ కుమార్​ అనే యువకుడిపై నలుగురు దుండగులు కాల్పులు జరిపారు. నయన్​ కిషన్​గంజ్ ప్రాంతానికి వెళ్లేందుకు.. బక్రీ నుంచి ఇమ్లీ ప్రాంతానికి వెళ్లే ట్రైన్​ ఎక్కాడు. అయితే బెగుసరాయ్​ రైల్వే స్టేషన్​లో నయన్​ ఉన్న బోగీలో నలుగురు వ్యక్తులు ఎక్కారు. కొద్ది సేపటి తర్వాత ఆ దుండగులు నయన్​ నుంచి ఫోన్​ లాక్కోవడానికి ప్రయత్నించారు. దానికి నయన్​ నిరాకరించాడు. దీంతో ఆ దుండుగులు ఇమ్లీ ప్రాంతానికి రాగానే నయన్​పై ఒక్కసారిగా కాల్పులు జరిపి ఫోన్​ను లాక్కున్నారు. ట్రైన్ ఆగిన వెంటనే అక్కడ నుంచి పరారయ్యారు. ఈ ఘటనతో ప్రయాణికుల్లో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని.. గాయపడిన యువకుడ్ని ఆస్పత్రికి తరలించారు. అనంతరం నిందితుల కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.

ప్రేమకు నో చెప్పిన విద్యార్థినిపై యాసిడ్ దాడి
కర్ణాటకలో అమానవీయ ఘటన వెలుగుచూసింది. ప్రేమకు నిరాకరించిన మైనర్​పై యాసిడ్​ దాడికి పాల్పడ్డాడో యువకుడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేపట్టారు. గాలింపు చర్యలు చేపట్టిన కొన్ని గంటల్లోనే నిందితుడ్ని అరెస్ట్​ చేశారు. రామ్​నగర్ జిల్లాలోని కనకపుర ప్రాంతంలో సుమంత్​ అనే 22 ఏళ్ల యువకుడు గత కొన్ని రోజులుగా.. అదే ప్రాంతానికి చెందిన ఓ 17 ఏళ్ల విద్యార్థినిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. అయితే సుమంత్​ ప్రేమను ఆమె నిరాకరించింది. దీంతో సుమంత్​ ఆమెపై కోపం పెంచుకున్నాడు. శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో ఎప్పటిలానే ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆమెపై సుమంత్​ ఒక్కసారిగా యాసిడ్​ దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆ యువతి ఎడమ కన్నుకు తీవ్రగాయలయ్యాయి. దాడి చేసిన అనంతరం సుమంత్​ అక్కడ నుంచి పరారయ్యాడు. నిందితుడు స్థానికంగా ఓ కారు మెకానిక్​గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details