తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మంగళూరులో కలకలం- ఉగ్రవాదులకు మద్దతుగా గ్రాఫిటీ - graffiti art

కర్ణాటకలోని మంగళూరులో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కలకలం సృష్టించారు. ఉగ్రవాదులకు మద్దతుగా గోడలపై రాతలు రాశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Miscreants graffiti on the wall in support of terrorist groups in Mangalore
మంగళూరులో కలకలం- ఉగ్రవాదులకు మద్దతుగా గ్రాఫిటీ

By

Published : Nov 27, 2020, 5:21 PM IST

ఉగ్రవాద సంస్థలకు మద్దతుగా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు.. గ్రాఫిటీ (గోడలపై చిత్రాలు) వేశారు. కర్ణాటక మంగళూరులోని ఓ అపార్ట్​మెంట్​ గోడలపై అభ్యంతరకర వ్యాఖ్యలు రాశారు. కద్రి పోలీస్​ స్టేషన్​ సమీపంలోనే ఇది జరగడం గమనార్హం. "ఆర్​ఎస్​ఎస్​ను ఎదుర్కొనేందుకు లష్కరే తోయిబా, తాలిబన్లను ఒక్కటి చేసేలా మాపై ఒత్తిడి పెంచొద్దు" అని గోడలపై రాసి ఉంది.

గ్రాఫిటీ

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. ఆ గ్రాఫిటీ వేసిన గోడలపై కవర్లు కప్పి ఉంచారు.

రాతలు కనిపించకుండా కవర్లతో కప్పిఉంచిన పోలీసులు

ఇదీ చూడండి: పండగ సీజన్​లో ఆన్​లైన్ విక్రయాలు భళా

ABOUT THE AUTHOR

...view details