తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మిర్రర్ రైటింగ్​లో యువతి ప్రతిభకు రికార్డులు దాసోహం - అక్షిత హెగ్డే ఇండియా బుక్ రికార్డ్

కర్ణాటకకు చెందిన అక్షిత హెగ్డే అనే యువతి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. కుడి నుంచి ఎడమ(మిర్రర్ రైటింగ్)కు రాసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్​, ఇంటర్​నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్​లలో చోటు సంపాదించుకున్నారు.

Akshita Hegde
అక్షిత హెగ్డే

By

Published : Aug 18, 2022, 9:50 PM IST

Updated : Aug 18, 2022, 10:51 PM IST

యువతి ప్రతిభకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్​లో చోటు

mirror writing: కర్ణాటక ఉడుపి జిల్లాకు చెందిన అక్షిత హెగ్డే అనే యువతి.. మిర్రర్​ రైటింగ్​లో అరుదైన రికార్డు సాధించారు. కన్నడ ప్రముఖ ఆధ్యాత్మిక గ్రంథమైన మంకుతిమ్మన కగ్గలోని 13 పద్యాలను 45.11 నిమిషాల్లో కుడి నుంచి ఎడమకు రాసి రికార్డులు ఒడిసిపట్టారు అక్షిత అనే యువతి. ఈ తక్కువ సమయంలోనే 52 లైన్లను పూర్తి చేశారు. దీంతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్​లో ఆమె చోటు సంపాదించారు.

ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్

ఉడిపి జిల్లా కుక్కేహళ్లి దొడ్డబీడుకు చెందిన సుభాశ్ చంద్ర హెగ్డే, జయలక్ష్మి దంపతుల కుమార్తె అక్షిత. ఆమె నిట్టే జస్టిస్ కెఎస్ హెగ్డే ఇన్​స్టిట్యూట్​లో ఎంబీఏ పూర్తి చేశారు. ప్రస్తుతం అదే సంస్థలో పరిశోధన విభాగంలో ​ అసిస్టెంట్​గా పనిచేస్తున్నారు.

అక్షిత హెగ్డే

అక్షిత తాను రాసిన చేతిరాతను మార్చిలో.. ఇండియన్​ బుక్ ఆఫ్ రికార్డ్స్​కు పంపారు. వారు అక్షిత ప్రతిభను గుర్తించి కుడి నుంచి ఎడమకు రాయమని ప్రోత్సహించారు. దాన్ని ఛాలెంజ్​గా తీసుకున్న అక్షిత 3-4 రోజులు సాధన చేసి.. మిర్రప్ రైటింగ్​ను నేర్చుకున్నారు. ఓ వీడియో క్లిప్​ను ఏప్రిల్​లో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్​కు పంపించారు.

"నా మిర్రప్​ రైటింగ్​ను చూసి పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. నా మిర్రర్​ రైటింగ్ వీడియో చూసి చాలా మంది తుళు భాషలో రాసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విజయం పట్ల చాలా ఆనందంగా ఉన్నా. నా ప్రతిభను గుర్తించిన సంస్థకు ధన్యవాదాలు. నా తల్లిదండ్రులు, గ్రామస్థులు, స్నేహితులు, ఉపాధ్యాయులు అందరూ నాకు అండగా నిలిచారు."
-అక్షిత హెగ్డే

ఇదీ చదవండి

Last Updated : Aug 18, 2022, 10:51 PM IST

ABOUT THE AUTHOR

...view details