తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బాలికకు వరుస లైంగిక వేధింపులు - పోక్సో చట్టం లైంగిక వేధింపులు

కేరళకు చెందిన ఓ బాలికకు వరుస లైంగిక వేధింపులు ఎదురవుతున్నాయి. ఇది వరకే రెండు సార్లు లైంగిక దాడికి గురైన బాలిక.. సంరక్షణ కేంద్రం నుంచి బయటకు రాగానే మరోసారి వేధింపుల బారిన పడింది.

Minor survivor sexually assaulted for the third time in Kerala
బాలికకు వరుస లైంగిక వేధింపులు

By

Published : Jan 18, 2021, 9:17 PM IST

కేరళకు చెందిన ఓ మైనర్​పై లైంగిక దాడికి పాల్పడ్డారు దుండగులు. గతంలో రెండుసార్లు ఇలాంటి వేధింపులు ఎదుర్కొన్న బాలిక.. ఇన్ని రోజులు ఓ సంరక్షణ కేంద్రంలో గడిపింది. అక్కడి నుంచి బయటకు రాగానే మళ్లీ వేధింపులు ఎదురయ్యాయి.

2016, 2017 సంవత్సరాల్లో లైంగిక వేధింపులు ఎదురైన నేపథ్యంలో పండిక్కడ్​కు చెందిన 17 ఏళ్ల బాలికను.. నిర్భయ చైల్డ్​కేర్ హోమ్​కు తరలించారు అధికారులు. నిందితులపై పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. అనంతరం బాలికను కుటుంబ సభ్యులకు అప్పగించారు. అక్కడి నుంచి బయటకు రాగానే ఆమెపై మళ్లీ లైంగిక దాడి జరిగింది.

ఈ నేపథ్యంలో అధికారుల పర్యవేక్షణపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సంరక్షణ కేంద్రాల నుంచి బయటకు వచ్చిన బాధితుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇదీ చదవండి:13 ఏళ్ల బాలికపై 9 మంది అత్యాచారం

ABOUT THE AUTHOR

...view details