తెలంగాణ

telangana

ETV Bharat / bharat

విద్యార్థిపై ఉపాధ్యాయుడి క్రూరత్వం.. చావుదెబ్బలు కొట్టి ఆపై... - విద్యార్థిని చావుదెబ్బలు కొట్టి

student beaten up by teacher: ఐదో తరగతి చదివే విద్యార్థిని ఓ ఉపాధ్యాయుడు చర్మం కమిలేలా కొట్టాడు. నిలదీసేందుకు వచ్చిన తల్లిదండ్రులపైనా ఉపాధ్యాయుడు ఘర్షణకు దిగాడు. ఈ ఘటన బిహార్​లోని బేతియా జిల్లాలో జరిగింది.

student beaten up by teacher

By

Published : Mar 13, 2022, 5:04 AM IST

Updated : Mar 13, 2022, 11:26 AM IST

student beaten up by teacher: బిహార్​లో ఓ ఉపాధ్యాయుడు దారుణంగా ప్రవర్తించాడు. ఐదో తరగతి చదువుతున్న విద్యార్థిని చావుదెబ్బలు కొట్టాడు. ఉపాధ్యాయుడి దెబ్బలకు బాలుడి చర్మం కమిలిపోయింది. కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రిలో చేర్పించారు. బేతియా జిల్లాలోని చంపాటియా బ్లాక్​లో ఈ ఘటన జరిగింది.

విద్యార్థిని ఇలా చితకబాది..

Teacher beating Student Bihar

స్థానిక స్కూల్లో పనిచేసే రాజేశ్ కుమార్ రాయ్ అనే ఉపాధ్యాయుడే విద్యార్థిపై కర్కశంగా ప్రవర్తించాడని తల్లిదండ్రులు తెలిపారు. పాఠశాలకు వెళ్లి అతడితో గొడవపెట్టుకున్నారు. అయితే, స్కూల్​కు వెళ్లిన తల్లిదండ్రులతోనూ ఉపాధ్యాయుడు అనుచితంగా ప్రవర్తించాడు. బాలుడి తండ్రి షర్ట్ కాలర్ పట్టుకొని ఘర్షణకు దిగాడు.

ఉపాధ్యాయుడి కర్కశత్వానికి గుర్తులు

తల్లిదండ్రులు చెప్పిన వివరాల ప్రకారం.. బాధిత విద్యార్థి అజిత్ కుమార్.. స్కూల్లో తన స్నేహితుడితో కలిసి దాగుడుమూతలు ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో ఓ విద్యార్థి టాయిలెట్​లో దాక్కున్నాడు. దీంతో సరదాగా టాయిలెట్ తలుపును అజిత్ మూసేశాడు. ఈ విషయం తెలుసుకున్న ఉపాధ్యాయుడు.. అజిత్​ను తీవ్రంగా కొట్టాడు. దీనిపై స్థానికులు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే, ఘటన తర్వాత.. నిందితుడు పారిపోయాడు. ఫోన్​ను సైతం స్విచ్ఛాఫ్ చేశాడు. బాలుడి కుటుంబ సభ్యులు ముఫాసిల్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేయగా... రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుడిని వెతికి పట్టుకున్నారు. ప్రస్తుతం ఉపాధ్యాయుడు తమ అధీనంలోనే ఉన్నాడని.. పోలీసులు తెలిపారు. దీనిపై దర్యాప్తు ముమ్మరం చేసినట్లు తెలిపారు.

ఇదీ చదవండి:హోలీ తర్వాతే యోగి ప్రమాణస్వీకారం- గవర్నర్​ను కలిసిన 'మాన్​'

Last Updated : Mar 13, 2022, 11:26 AM IST

ABOUT THE AUTHOR

...view details