తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పదో తరగతి బాలికపై స్కూల్​ యజమాని అత్యాచారం - మైనర్ పై అత్యాచారం చేసిన వ్యక్తిని కొట్టి చంపిన మహిళలు

Minor raped: రాజస్థాన్​లోని జైపుర్​లో మైనర్​పై అత్యాచారం చేశాడు ఓ వ్యక్తి. ప్రస్తుతం ఆ బాలిక రెండు నెలల గర్భవతి అని పోలీసులు తెలిపారు. దీంతో నిందితుడ్ని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.

Minor raped, impregnated by school owner in Jaipur
మైనర్​ను గర్భవతిని చేసిన స్కూల్​ యజమాని..!

By

Published : Mar 16, 2022, 9:29 PM IST

Minor raped: పదో తరగతి చదువుతున్న ఓ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ స్కూల్​ యజమాని. ఈ ఘటన రాజస్థాన్​లోని జైపుర్​లో జరిగింది. ప్రస్తుతం ఆ బాలిక రెండు నెలల గర్భవతి అని పేర్కొన్నారు. ఆ అమ్మాయిని గర్భవతిని చేసిన వ్యక్తిని పురుషోత్తం శర్మగా గుర్తించారు పోలీసులు.

నిందితుడిపై పోక్సో చట్టం ప్రకారం సంబంధిత సెక్షన్​లో కింద కేసు నమోదు చేశారు. అనంతరం అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

చెట్టుకు కట్టేసి ప్రాణం తీసిన మహిళలు..

త్రిపురలోని ధలై జిల్లాలో కొందరు మహిళలు ఓ వ్యక్తిని చెట్టుకు కట్టేసి కొట్టి చంపారు. చనిపోయిన వ్యక్తి ఓ అత్యాచార కేసులో నిందితుడు అని పోలీసులు తెలిపారు. ఈ ఘటన జిల్లాలోని గండచెర్ర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అయితే నిందితుడు ఇది వరకే ఓ హత్య కేసులో ఎనిమిదేళ్ల కఠిన కారాగార శిక్షను అనుభవించినట్లు అధికారులు తెలిపారు. అయితే ఐదేళ్ల బాలిక మంగళవారం రాత్రి తన తల్లితో కలిసి మతపరమైన కార్యక్రమానికి వస్తే... చిన్నారిని సమీపంలోని అడవికి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు పేర్కొన్నారు. బాలిక చెప్పిన ఆధారాల ప్రకారం నిందితుడ్ని గుర్తించిన మహిళలు బుధవారం తెల్లవారుజామున అతడిని పట్టుకుని చెట్టుకు కట్టేసి కొట్టారు. దీంతో అతను స్పృహ కోల్పోయాడు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ఇదీ చూడండి:

సరిపడినంత భోజనం పెట్టలేదని వృద్ధుడిని కొట్టి చంపాడు!

ABOUT THE AUTHOR

...view details