ఉత్తర్ప్రదేశ్ బారాబంకిలోని అసాంద్ర గ్రామానికి చెందిన ఓ మైనర్ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే బిడ్డకు తండ్రి ఎవరు అనే విషయంపై బాలిక నాన్న ఏడుగురి మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారంత తన కుమార్తెపై సామూహిక అత్యాచారం చేసినట్లు ఆరోపించాడు. ఈ ఏడుగురిలో బాధితురాలి భర్త కూడా ఉండడం గమనార్హం.
ఇదీ జరిగింది..
రెండు నెలల క్రితం.. గ్రామంలోని ఓ బాలిక అత్యాచారానికి గురైంది. అనంతరం అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో ఆమె వివాహం జరిగింది. ఆ యువకుడే అత్యాచారం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. అయితే తన కుమారుడు అమాయకుడని ఆ యువకుడి తల్లి చెప్పుకొచ్చింది. బాధితురాలి కుటుంబసభ్యులు తమను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించింది. మైనర్ తండ్రి, ఇతరులు కలిసి ఒత్తిడి తెచ్చి డెలివరికి సంబంధించిన ఖర్చులతో సహా రూ.6 లక్షల నగదును, ప్రతి నెల రూ. 3000ను తీసుకుంటున్నట్లు తెలిపింది. ఈ విషయంలో ఉన్నతాధికారులు కలగజేసుకుని న్యాయం చేయాలని వేడుకుంది.
బాధితురాలి తండ్రి వాదన ఇలా...