తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నాలుగు రోజులుగా బాలికపై అత్యాచారం.. జ్యూస్​లో మత్తుమందు కలిపి.. - పాఠశాల విద్యార్థినిపై అత్యాచారం

Minor Rape Case in bengaluru: మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఆరుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ ఘటన బెంగుళూరులో జరిగింది. నిందితులికి సహకరించిన వారిలో మహిళలు ఇద్దరున్నారు.

minor girl rape
మైనర్ బాలికపై అత్యాచారం

By

Published : Mar 11, 2022, 8:17 PM IST

Minor Rape Case in bengaluru: బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనలో ఆరుగురుని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ ఘటన కర్ణాటకలోని బెంగుళూరులో హెచ్​ఎస్​ఆర్​ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

టైలరింగ్ నేర్చుకుందామని వెళ్తే..

రాజేశ్వరి, కళావతి అనే మహిళలు టైలరింగ్ దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. వీరి దగ్గరకి టైలరింగ్ నేర్చుకోవడానికి ఓ పాఠశాల విద్యార్థి వచ్చేది. రాజేశ్వరి కొద్ది రోజుల క్రితం ఆ బాలికకు జ్యూస్​లో మత్తుమందు ఇచ్చి.. ఆమె స్పృహ కోల్పోయేలా చేసింది. ఈ క్రమంలో కేశవమూర్తి అనే వ్యక్తి ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికి చెప్పవద్దని రాజేశ్వరి.. బాధితురాలిని బెదిదించింది.

రెండు రోజుల తర్వాత బాధితురాలిని కళావతి ఇంటికి తీసుకెళ్లింది. అక్కడ రఫిక్, సత్యరాజ్, శరత్, రాజేష్ అనే యువకులు నాలుగు రోజులుగా పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. దీనికి కళావతి, రాజేశ్వరి ఇద్దరూ.. డబ్బుల కోసం నిందితులకు సహకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

నాలుగు రోజుల తర్వాత బాలిక అనారోగ్యానికి గురికావడం వల్ల.. బాధితురాలు.. తన తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని చెప్పింది. వెంటనే బాలిక తల్లిదండ్రులు హెచ్‌ఎస్‌ఆర్‌ లేఅవుట్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులు ఆరుగురుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి.. అరెస్ట్ చేశారు.

ఇదీ చదవండి: హెడ్​మాస్టర్ పాడు బుద్ధి..​ వాట్సాప్​లో అసభ్య మెసేజ్​లు.. చంపేస్తానంటూ...

ABOUT THE AUTHOR

...view details