Minor Rape Case: రాజస్థాన్ డూంగర్పుర్లో దారుణం జరిగింది. బాలికను ఆమె చదువుతున్న పాఠశాలలోని ఇద్దరు బాలురు కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారు.
బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది. అదే పాఠశాలకు చెందిన ఇద్దరు బాలురు ఆమెను కిడ్నాప్ చేసి సమీప అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లారు. అక్కడే ఆమెపై అత్యాచారం చేశారు. సోమవారం ఈ ఘటన జరిగింది. మంగళవారం కేసు నమోదు చేశారు పోలీసులు. బాధితురాలి కుటుంబ సభ్యుల సమాచారం మేరకు నిందితులను గుర్తించినప్పటికీ.. వారిని అరెస్టు చేయలేదు.