తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కుటుంబంలోని నలుగురిని హత్య​ చేసిన బాలుడు​.. అంతు చిక్కని కారణం!

13 ఏళ్ల బాలుడు తన కుటుంబంరలోని నలుగురిని హత్య చేసి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అతడి కోసం గాలించి పట్టుకున్నారు.

Minor held for killing four including mother, sister in Tripura
Minor held for killing four including mother, sister in Tripura

By

Published : Nov 6, 2022, 2:30 PM IST

Updated : Nov 6, 2022, 3:46 PM IST

ఒకే కుటుంబంలోని నలుగురిని హత్య చేసిన 13 ఏళ్ల మైనర్​.. ఆ తర్వాత వారిని పూడ్చిపెట్టి పరారయ్యాడు. ఈ ఘటన త్రిపురలోని ధలై జిల్లాలో జరిగింది. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పరారైన బాలుడ్ని పట్టుకున్న పోలీసులు.. అతడిపై కేసు నమోదు చేసుకున్నారు. అయితే వీరిందనీ ఎందుకు చంపాడో అర్థం కావట్లేదని స్థానికులు అంటున్నారు.

అసలేం జరిగింది: త్రిపురలోని కమల్‌పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దురై శివబారి ప్రాంతంలో శనివారం రాత్రి ఓ 13 ఏళ్ల బాలుడు తన తల్లితో పాటు మరో ముగ్గురిని చంపి, వారిని అక్కడే పూడ్చి పెట్టాడు. మృతిచెందిన వారిలో బాలుడి తాత బాదల్ దేబ్నాథ్ (70), తల్లి సమితా దేబ్నాథ్ (32) సోదరి సుపర్ణ దేబ్‌నాథ్ (10) తో పాటు బంధువు రేఖ దేబ్ (42) ఉన్నారు.

స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పరారైన బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు బాలుడ్ని పట్టుకున్న పోలీసులు.. కోర్టు ఆదేశాలతో అతడ్ని రిమాండ్​కు తరలించారు. అయితే హత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

ప్రేమ జంటను బలిగొన్న కుటుంబసభ్యులు..
ఉత్తర్​ప్రదేశ్​ ఫరూఖాబాద్ జిల్లాలోని కమల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి ఓ ప్రేమ జంటను వారి కుటుంబసభ్యులు గొంతు కోసి హత్య చేశారు. బాలిక సోదరుడు ఇచ్చిన సమచారంతో రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాలు స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
కమల్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లోని రాజేపుర్ సరైమెడ గ్రామానికి చెందిన భయ్యా లాల్ జాతవ్ 15 ఏళ్ల కుమార్తె శివాని, మహావీర్ జాతవ్ కుమారుడు రామ్‌కరణ్​ గతకొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరిద్దరి విషయం ఇంట్లో వాళ్లకు తెలిసింది. దీంతో వారిని ఓ కంట కనిపెడూతూ వచ్చారు. ఈ క్రమంలో శనివారం రాత్రి శివాని కనిపించకుండా పోయింది.

బాలిక ఆచూకీ కోసం వెతుకుతున్న కుటుంబసభ్యులకు ఊరి బయటనున్న మామిడితోటలో ప్రేమజంట కనిపించింది. దీంతో ఆగ్రహం చెందిన కుటుంబసభ్యులు వారిద్దరినీ సింగిరాంపుర్ గ్రామ సమీపంలోని ఖాంతా నాలా వద్దకు తీసుకెళ్లి గొంతు కోసి హత్య చేశారు. బాలిక సోదరుడు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పొదల్లో ఉన్న మృతదేహాలను వెలికితీశారు. త్వరలోనే నిందితులను పట్టకుంటామని పోలీసులు తెలిపారు.

యజమానికి మత్తు మందు ఇచ్చి చోరీ..
తమ యజమాని తినే ఆహారంలో మత్తు మందు కలిపిన ఇంట్లోని వంటవాళ్లు.. వారందరూ అపస్మారక స్థితికి చేరుకున్నాక అక్కడున్న సామాన్లన్నీ తీసుకుని పరారయ్యారు. ఈ ఘటన రాజస్థాన్​లోని జోధ్​పుర్​లో జరిగింది. మత్తు వదిలిన తర్వాత షాక్​కు గురైన వ్యాపారి పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఇంటిని సీజ్​ చేసి దర్యాప్తు ప్రారంభించారు.

జోధ్​పుర్​లోని ఎయిర్​పోర్ట్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ఓ హస్తకళా వ్యాపారి.. రెండు నెలల క్రితం తన ఇంటికి ముగ్గురు పనివాళ్లను నియమించుకున్నాడు. శనివారం రాత్రి ఓ ఫ్యామిలీ ఫంక్షన్​ కోసం కుటుంబసభ్యులు అందరూ బయటకు వెళ్లగా.. వ్యాపారి, అతని కుమార్తె మాత్రం ఇంట్లో ఉండిపోయారు. ఇదే సరైన సమయమని భావించిన ఆ పనివాళ్లు తినే ఆహారంలో మత్తు మందు కలిపి వారికి వడ్డించారు. ఆ అన్నం తిన్న వ్యాపారి, అతని కుమార్తెతో పాటు ఇద్దరు డ్రైవర్లు కాసేపటికే అపస్మారక స్థితికి చేరుకున్నారు. వెంటనే తమ చేతి వాటాన్ని ప్రదర్శించేందుకు సిద్ధమైన పనివాళ్లు.. మొదట ఇంట్లోని సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఆ తర్వాత ఇంట్లోని సామాన్లంతా చిందరవందర చేసి నగలు, డబ్బులు, విలువైన వస్తువులను తీసుకుని కారులో పరారయ్యారు. ఇంట్లోని మిగతా కార్ల తాళాల్నీ తమ వెంట తీసుకెళ్లారు. దారి మధ్యలో తమ సెల్​ఫోన్లను పారేశారు.

ఆదివారం ఉదయం యజమాని లేచి చూసేసరికి ఇల్లంతా గందరగోళంగా మారింది. దీంతో షాక్​కు గురైన వ్యాపారి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యప్తు ప్రారంభించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురు నిందితుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. అయితే దర్యాప్తులో మరిన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

వ్యాపారి ఇంట్లో నాలుగేళ్లుగా పని చేస్తున్న ఓ మహిళ.. తమ కుటుంబంలోని మరో ముగ్గురిని తీసుకొచ్చి పనిలో చేర్పించింది. ఎప్పటి నుంచో చోరీకి స్కెచ్​ వేసిన నిందితులు సరైన సమయం చూసుకుని ప్లాన్​ అమలు చేశారు. అంతే కాకుండా వారు నగలు తీసుకుని పరారవుతున్న సమయంలో ఇంటి వద్దకు ఓ కారు వచ్చి వారి తీసుకెళ్లిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. పరారైన నిందితుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నట్లు సమచారం.

ఇదీ చదవండి:3 ఎకరాలు విక్రయం.. 30 లక్షలు ఖర్చు.. ఆహార కల్తీపై అలుపెరుగని పోరాటం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేశాయి: కేఏ పాల్

Last Updated : Nov 6, 2022, 3:46 PM IST

ABOUT THE AUTHOR

...view details