తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చిన్నారిపై అత్యాచారం.. ఆపై వీడియో చిత్రించి.. - రాజస్థాన్​లో అత్యాచారం ఘటన

ఓ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ 20 ఏళ్ల యువకుడు. ఘటన జరిగే సమయంలో ఫొటోలు, వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్​ చేసినట్లు పోలీసులు తెలిపారు. రాజస్థాన్​లోని జలోర్​ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

rape
అత్యాచారం

By

Published : Oct 15, 2021, 3:43 PM IST

రాజస్థాన్​లో దారుణం జరిగింది. 20 ఏళ్లు యువకుడు ఓ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంకా ఆ సమయంలో జరిగింది అంతా ఫోన్​లో చిత్రీకరించి.. సామాజిక మాధ్యమాల్లో షేర్​ చేశాడు. ఈ వీడియో రాజస్థాన్​లోని జలోర్​ జిల్లావ్యాప్తంగా చక్కర్లు కొట్టినట్లు పోలీసులు తెలిపారు.

నిందితుడు మన్సూర్​ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

తొలుత నిందితుడు బాలికతో స్నేహితుడిలా మెలిగి.. నమ్మకం కలిగించి ఆపై అత్యాచారానికి ఒడిగట్టాడని అధికారులు చెప్పుకొచ్చారు. అతణ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:దళిత మహిళపై గ్యాంగ్ రేప్.. భర్త ఎదురుగానే...

ABOUT THE AUTHOR

...view details