Up Rape News: ఉత్తర్‌ప్రదేశ్ మొరదాబాద్‌లో దారుణం జరిగింది. 7 ఏళ్లు చిన్నారిని కిడ్నాప్ చేసిన దుండగులు అత్యాచారం చేసిన చంపేసినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని కాంత్ ప్రాంతంలో ఉండే చెరుకు తోటల్లో బాలిక మృతదేహాన్ని గుర్తించిన ఓ రైతు పోలీసులకు సమాచారం అందించినట్లు పేర్కొన్నారు.
మృతదేహానికి శవ పరీక్ష నిర్వహించిన వైద్యులు.. చిన్నారిపై అత్యచారం జరిగినట్లు నిర్ధరించారు. బాలిక ఆచూకీ తెలియడం లేదని తల్లిదండ్రులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోక్సో, ఐపీసీ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. త్వరలోనే దోషులను పట్టుకుంటామన్నారు. మొరాదాబాద్ ఎంపీ ఎస్టీ హసన్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.
17 ఏళ్ల బాలికపై అత్యాచారం..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఓ యువకుడు 17 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడ్ని అక్షిత్గా పోలీసులు గుర్తించారు. అయితే నిందితుడు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే గ్రామం నుంచి బాలికను నాలుగు రోజుల క్రితం అక్షిత్ కిడ్నాప్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు వెతకగా.. గ్రామానికి సమీపంలో ఉండే ప్రాంతంలో బాలిక అపస్మారక స్థితిలో ఉండడాన్ని గుర్తించారు. కొద్దిసేపటి తరువాత తేరుకున్న బాలిక.. అక్షిత్ అత్యాచారానికి పాల్పడినట్లు వివరించింది. నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు వేట మొదలు పెట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.