కర్ణాటకలో దారుణం జరిగింది. 15 ఏళ్ల బాలికపై కొందరు కామాంధులు అత్యాచారం చేసి చంపేశారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలిక.. ఎంతకీ తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు వెళ్లి వెతకగా.. చెరుకు తోటలో అనుమానస్పద స్థితిలో శవమై కనిపించింది. దీంతో మృతురాలి బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దర్యాప్తు చేసిన పోలీసులు.. దుండగుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్లు తేల్చారు. కలబురగి జిల్లా అలంద్ తాలుకాలో ఈ ఘటన జరిగింది.
15 ఏళ్ల బాలికపై అత్యాచారం.. ఆపై హత్య.. చెరుకు తోటలో పడేసి.. - మైనర్ బాలికపై అత్యాచారం హత్య
తొమ్మిదవ తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్యకు పాల్పడ్డాడు గుర్తుతెలియని దుండగులు. పండగకు ఊరికి వచ్చిన ఆమె సాయంత్రం వేల పంట పొలాలను చూడడానికి బయటికి వెళ్లింది. ఎంతకీ తిరిగి రాకపోవడం వల్ల కుటుంబ సభ్యులు వెళ్లి వెతకగా చెరుకు తోటలో విగతజీవిగా పడి ఉంది.
వివరాల్లోకి వెళ్తే..
బాలిక ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతోంది. తన బంధువుల ఇంట్లో ఉంటూ స్కూల్‌కి వెళ్తోంది. దీపావళి సందర్భంగా సొంతురుకు వచ్చిన ఆమె, అలా కాసేపు పంట పొలాలను చూడడానికి మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లింది. కానీ, తిరిగి రాలేదు. దాంతో కంగారు పడ్డ కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. చివరకు ఆమె మృతదేహం చెరకు తోటలో కనిపించింది. బాలిక శవంపై గాయాలున్నాయి. దుండగులు ఆమెపై అత్యాచారం చేసి.. హత్య చేసినట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.
"పోలీసు అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదైంది. అలంద పోలీసులు విచారణ చేపట్టారు."
-కలబురగి ఎస్పీ ఇషా పంత్