Minor Girl Rape: బిహార్ జముయీలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. పాఠశాల నుంచి ఇంటికి వస్తున్న బాలికను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు. ఖైరా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన.
ఇదీ జరిగింది:ఎప్పటిలాగే స్కూల్ నుంచి 14 ఏళ్ల బాలిక ఇంటికొస్తుండగా.. ఐదుగురు యువకులు ఆమెను అడ్డగించారు. సమీపంలోని అడవుల్లోకి తీసుకెళ్లి ఒక్కొక్కరుగా అఘాయిత్యానికి ఒడిగట్టారు. స్పృహతప్పిన బాధితురాలిని అక్కడే వదిలేసి పరారయ్యారు. ఎంతకూ ఇంటికి రాకపోయేసరికి ఆమె కోసం వెతకడం ప్రారంభించారు బాలిక తల్లిదండ్రులు. చివరకు బాధితురాలే ఎలాగోలా ఇంటికి చేరింది. జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో ఆమెను ఆస్పత్రిలో చేర్చి.. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటివరకు ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు.. మిగతావారి కోసం గాలిస్తున్నారు. 10 రోజుల కింద.. నిందితుల్లో ఒకరు బాలికను వేధించినట్లు తెలుస్తోంది. అప్పుడు.. స్థానికులు సమస్యను పరిష్కరించినట్లు సమాచారం.
ఆటోలో వెళ్తున్న యువతిని బయటకు లాగి.. ఉత్తర్ప్రదేశ్లో మరో దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గోండాలోని ధనేపుర్లో ఆటోలో వెళ్తున్న ఓ యువతిని బయటకు లాగి, లైంగికదాడికి పాల్పడ్డారు నలుగురు యువకులు. నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. వారికోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.ఏప్రిల్ 23న ఈ ఘటన జరిగింది.