ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌పుర్‌లో దారుణం జరిగింది. సోదరుని ముందే ఓ బాలికను నలుగురు వ్యక్తులు కలిసి అత్యాచారం చేశారు. అక్కడితో ఆగకుండా ఈ దారుణాన్ని వీడియోలో చిత్రించారు.
శుక్రవారం రాత్రి బాధితురాలి ఇంట్లోకి నిందితులు రాహిబ్, సహిబ్, ఆరిఫ్, మారుఫ్ ప్రవేశించారు. బాలిక సోదరున్ని గన్‌తో బెదిరించి అతని ముందే బాధితురాలిని అత్యాచారం చేశారు. ఎవరికీ చెప్పకూడదని బెదిరించడానికి ఈ దారుణాన్ని వీడియోలో చిత్రించారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఆ సమయంలో బాలిక తల్లిదండ్రులు ఇంటికి దూరంగా ఉన్నారు.