minor girl gangrape suicide: హరియాణాలో దారుణం జరిగింది. చరఖీ దాదరీ జిల్లాలో 17 ఏళ్ల మైనర్‌పై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు ఇంటి దగ్గరే ఉండి 12వ తరగతి పరీక్షలకు సన్నద్ధమవుతోంది. ఇంటి దగ్గర బాలిక ఒంటరిగా ఉన్న విషయాన్ని పసిగట్టారు నిందితులు. ఆమెను అపహరించి.. నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు షెడ్యూల్డ్ కులానికి చెందిన బాలిక.
మైనర్‌పై గ్యాంగ్ రేప్.. బాధితురాలి ఆత్మహత్య - హరియాణాలో సామూహిక అత్యాచారం
minor girl gangrape suicide: 17 ఏళ్ల మైనర్‌పై అత్యాచారానికి పాల్పడ్డారు ముగ్గురు యువకులు. మనస్తాపంతో బాధితురాలు ఆత్మహత్య చేసుకుంది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన హరియాణాలో ఆదివారం జరిగింది.

మైనర్‌పై సామూహిక అత్యాచారం
మనస్తాపానికి గురైన బాధితురాలు ఆదివారం ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బాధితురాలు, నిందితులు ఒకే గ్రామానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. 21 ఏళ్ల ప్రధాన నిందితుడు ఆమె ఇంటి సమీపంలోనే నివాసం ఉంటున్నాడని వెల్లడించారు. అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితులపై పోక్సో చట్టం, ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.