తెలంగాణ

telangana

ETV Bharat / bharat

11 ఏళ్ల బాలికపై గ్యాంగ్​రేప్.. నాలుగేళ్ల చిన్నారిపై 69 ఏళ్ల వృద్ధుడు! - మహారాష్ట్ర వార్తలు

11 ఏళ్ల బాలికపై కొందరు యువకులు పలుమార్లు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన మహారాష్ట్రలో జరిగింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు, కేరళలో నాలుగేళ్ల చిన్నారిపై 69 ఏళ్ల వృద్ధుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

ేcrime newas
crime newas

By

Published : Jul 28, 2022, 12:46 PM IST

Minor Girl Gang Rape Case: మహారాష్ట్రలోని నాగ్​పుర్​ జిల్లాలో దారుణం జరిగింది. 11 ఏళ్ల ఓ మైనర్​పై పలుమార్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు కొందరు యువకులు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. తొమ్మిది మంది నిందితులను పోక్సో చట్టం కింద అరెస్ట్​ చేశారు.

పోలీసుల వివరాలు ప్రకారం..నాగ్​​పుర్​ నగరానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామంలో బాధితురాలు తన కుటుంబంతో నివసిస్తోంది. బాధితురాలి తల్లిదండ్రులు ప్రతిరోజు కూలి పనికి వెళ్తారు. ఇదే అదనుగా తీసుకున్న ప్రధాన నిందితుడు కర్గంకర్​.. జూన్​ 19న బాలిక తన ఇంటికి తీసుకెళ్లి స్నేహితులతో కలిపి సామూహిక అత్యాచారం చేశాడు. ఆ తర్వాత కొంత డబ్బును ఇచ్చి ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని చెప్పాడు. అక్కడి మూడు రోజులు తర్వాత.. ప్రధాన నిందితుడి మరికొంతమంది స్నేహితులు ఆమెపై సామూహిక అఘాయిత్యానికి పాల్పడ్డారు. అలా పలుమార్లు అత్యాచారం చేశారు. అయితే అనుమానం వచ్చిన బాధితురాలి తల్లిదండ్రులు విషయాన్ని ఆరా తీయగా.. బాలిక మొత్తం చెప్పేసింది. దీంతో వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నాలుగేళ్ల బాలికపై 69 ఏళ్ల వ్యక్తి..
కేరళలోని కొడుమోన్​లో దారుణ ఘటన వెలుగు చూసింది. తన భార్య దగ్గర మలయాళం భాషను నేర్చుకోవడానికి వచ్చిన ఓ నాలుగేళ్ల చిన్నారిపై 69 ఏళ్ల వృద్ధుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తర్వాత రోజు బాధిత చిన్నారి.. జరిగిన విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలియజేసింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించగా.. నిందితుడిని మంగళవారం సాయంత్రం అరెస్ట్​ చేశారు. కోర్టు ముందు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. విచారణలో నిందితుడు నేరం అంగీకరించాడని చెప్పారు.

ఇవీ చదవండి:ఎంపీల 50 గంటల నిరాహార దీక్ష.. తిండి, నిద్రా అంతా అక్కడే..

'సారా ఇప్పించండి సారూ'... హోంమంత్రికి కల్తీ మద్యం బాధితుడి విజ్ఞప్తి

ABOUT THE AUTHOR

...view details