మహారాష్ట్ర పుణెలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కొండ్వాలోని ధ్వాడేకు చెందిన ఓ బాలిక యూట్యూబ్లో వీడియో చూసి బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆ నవజాత శిశువును కిటీకీలో నుంచి బయటకు విసిరేసింది. దీనిపై ఉత్తమ్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ ఘటనపై మహిళా కమీషన్ సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది.
యూట్యూబ్ చూసి బిడ్డకు జన్మనిచ్చిన మైనర్! శిశువును ఏం చేసిందంటే? - యూట్యూబ్ చూసి బిడ్డ జననం
మహారాష్ట్రలో ఓ బాలిక యూట్యూబ్లో వీడియో చూసి బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆ నవజాత శిశువును కిటీకీలో నుంచి బయటకు విసిరేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టారు.
ఏం జరిగిందంటే
బాలిక కొద్ది రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతుండగా.. ఆమె తల్లి ఆస్పత్రికి తీసుకువెళ్లింది. బాలికను పరీక్షించిన డాక్టర్ గర్భవతి కావచ్చేమో అని అనుమానించి.. సోనోగ్రఫీ పరీక్ష చేయించాలని సూచించారు. వైద్యులు సూచించినా ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఇంటికి వెళ్లారు తల్లీకూతురు. ఇదిలా ఉండగా.. వారు నివసిస్తున్న ప్రాంతంలో అప్పుడే పుట్టిన ఓ నవజాత శిశువు స్థానికులకు కనిపించింది. అదే రోజు రాత్రి బాలిక ఆస్పత్రిలో కనిపించింది. దీంతో అనుమానం వచ్చి బాలికను ప్రశ్నించగా.. విస్తుపోయే నిజాన్ని వెల్లడించింది. తానే యూట్యూబ్లో వీడియో చూసి బిడ్డకు జన్మనిచ్చానని.. తరువాత బిడ్డను కిటికీ నుంచి కిందకు విసిరేసినట్లు చెప్పింది.