తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బాలికపై దారుణం.. స్నేహితులతో కలిసి భర్త అత్యాచారం.. సిగరెట్లతో కాల్చి.. - కర్ణాటక గ్యాంగ్​రేప్ న్యూస్

Minor Gangrape in Karnataka: కర్ణాటకలో దారుణం జరిగింది. మైనర్​పై ఆమె భర్త.. ముగ్గురు స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం సిగరెట్లతో శరీరంపై కాల్చి హింసించాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని హెచ్చరించాడు.

Gangrape in Karnataka
Gangrape in Karnataka

By

Published : Jun 26, 2022, 10:52 PM IST

Minor Gangraped in Karnataka: కర్ణాటకలో ఓ మైనర్​పై ఆమె భర్త అత్యాచారానికి పాల్పడ్డాడు. మరో ముగ్గురు స్నేహితులతో కలిసి గ్యాంగ్​రేప్ చేశాడు. బాధితురాలి వయసు పదిహేడున్నర ఏళ్లని చిత్రదుర్గ నగర పోలీసులు తెలిపారు. జూన్ 25న ఈ ఘటనపై తమకు ఫిర్యాదు అందిందని చెప్పారు. బాధితురాలికి జిల్లా ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోందని వెల్లడించారు.

ప్రేమ పేరుతో బాలికను నిందితుడు మభ్యపెట్టాడు. బాలిక కుటుంబ సభ్యులకు చెప్పకుండానే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వివాహం గురించి ఇంట్లో ఎవరికీ చెప్పొద్దని బాలికను బెదిరించాడు. కొద్దిరోజుల తర్వాత బాలిక కన్యత్వాన్ని ప్రశ్నిస్తూ గొడవపడటం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే జూన్ 7న ఆమెను చిత్రదుర్గలోని మలప్పనహట్టి వద్ద ఉన్న ఓ నిర్మాణ ప్రదేశానికి రావాలని ఆమెను పిలిచాడు. అక్కడికి వెళ్లిన ఆమెను లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. అతడి వెంట వచ్చిన ముగ్గురు స్నేహితులు సైతం బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టారు.

ఆ తర్వాత బాలికను నలుగురు తీవ్రంగా హింసించారు. సిగరెట్లతో శరీరంపై కాల్చారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. గట్టిగా అరిచానని.. అయినా ఎవరూ రాలేదని తెలిపింది. తలపై బలంగా కొట్టేసరికి స్పృహతప్పి పడిపోయానని పోలీసులకు ఇచ్చిన స్టేట్​మెంట్​లో వివరించింది. ఆస్పత్రిలోనే తాను మళ్లీ కళ్లు తెరిచానని పేర్కొంది. ఈ విషయం గురించి ఎవరికైనా చెబితే చంపేస్తానని తన భర్త బెదిరించినట్లు బాధితురాలు పేర్కొంది. అనంతరం ధైర్యం తెచ్చుకొని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులపై అత్యాచారం, హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. బాలిక భర్తపై అదనంగా బాల్య వివాహాల కేసు పెట్టారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details