తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఫ్రెండ్​ను నమ్మి వెళ్లడమే ఆ బాలిక తప్పు.. ఏడుగురు కలిసి... - మైనర్​పై అత్యాచారం

పిలిచింది స్నేహితుడే కదా అని నమ్మింది ఆ బాలిక(13). అతనితో కలిసి వెళ్లింది. కానీ అతనిలోని దుర్బుద్ధిని గుర్తించలేక మోసపోయింది. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి.. ఆరుగురు స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి(minor gangrape) పాల్పడ్డాడు దుండగుడు. ఈ ఘటన ఝార్ఘండ్​, రాంచీ జిల్లాలో జరిగింది.

Minor gang raped in Ranchi,
బాలికపై సామూహిక అత్యాచారం

By

Published : Aug 30, 2021, 10:48 AM IST

దేశంలో మహిళలు, బాలికలపై అత్యాచార ఘటనలు రోజూ ఏదో మూలన వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఓ 13 ఏళ్ల బాలికపై ఏడుగురు మైనర్లు అత్యాచారానికి(minor gangrape) పాల్పడ్డారు. ఝార్ఘండ్​, రాంచీ జిల్లాలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అత్యాచారంలో బాలిక స్నేహితుడే సూత్రధారి కావటం గమనార్హం.

ఇదీ జరిగింది..

జిల్లాలోని మందర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బాలికను ఆమె స్నేహితుడు ఒకరు గురువారం రాత్రి తన వద్దకు రమ్మని పిలిచాడు. బాలిక వెళ్లగా ఆమెను ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ అతని స్నేహితులు ఆరుగురు ఉన్నారు. అందరు కలిసి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలిని(gang rape victim).. ఆమె స్నేహితురాలి ఇంటి వద్ద వదిలి వెళ్లారు. తెల్లవారాక ఇంటికి చేరిన బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది.

మందర్​ పోలీస్​ స్టేషన్​కు వెళ్లి ఫిర్యాదు చేశారు బాధితురాలి తల్లిదండ్రులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల్లో నలుగురిని అరెస్ట్​ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు చెప్పారు.

ఇదీ చూడండి:minor gangrape: కర్ణాటకలో 15ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం

ABOUT THE AUTHOR

...view details